ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చెప్పాల్సిన అవసరం లేదు. వాటిలో పాలకూరకు ప్రత్యేక స్థానం ఉంది. విటమిన్ ఏ, సి, కె, ఫోలెట్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషణను అందించి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అయితే, వర్షాకాలంలో పాలకూరను తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా చాలా అవసరమని నిపుణుడంటున్నారు. పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వైరల్, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో తోడ్పడతాయి. ఇందులో ఐరన్ రక్తహీనతను తగ్గించడంలో. అలాగే, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏ కూడా పాలకూరలో సమృద్ధిగా ఉంటుంది.
అయితే వర్షాకాలంలో ఆకుకూరలపై మట్టి, సూక్ష్మక్రిములు లేదా పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పాలకూరను వందే ముందు శుభ్రమైన నీటితో పలుమార్లు కడిగి మాత్రమే ఉపయోగించాలి. పూర్తిగా ఉడికించి తినడం ఇంకా మంచిది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు లేదా ఆక్సలెట్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో మాత్రమే ఎక్కువ మోతాదులో పాలకూర తీసుకోవాలి. సరైన పరిశుభ్రత పాటిస్తూ తాజాగా ఉన్న పాలకూరను ఆహారంలో చేర్చుకుంటే వర్షాకాలంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

