వల్లభనేని అనిల్: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, డాన్సర్స్ యూనియన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సంబంధించిన వివాదం ఎట్టకేలకు తెరపడింది. సినీ పరిశ్రమ పెద్దల సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో అన్ని విభేదాల చర్చల ద్వారా పరిష్కరించబడింది, పరిశ్రమలో సామరస్య వాతావరణం కొనసాగేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫెడరేషన్ ప్రతినిధులు, నిర్మాతల మండలి సెటరీ ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, అజయ్, ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయిరాజేష్, డాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలత దేవి, జానీ మాస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. జానీ మాస్టర్ తనపై వచ్చిన ఫిర్యాదు పూర్తి వివరణ ఇవ్వగా, ఫెడరేషన్ ఆ వివరణతో సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై విధించిన నాన్ కోఆపరేషన్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై జానీ మాస్టర్ యథావిధిగా తన వృత్తిపరమైన బాధ్యతలను నిర్వహించేందుకు నిరూపించారు.
డాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా చర్చించారు. యూనియన్ కార్యవర్గంపై వచ్చిన ఆరోపణలు, సస్పెన్షన్ అంశాలను సర్వసభ్య సమావేశంలో చర్చించి ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలని ఫెడరేషన్ సూచించినట్లు. సుమలత దేవి ప్రస్తుతం కార్యవర్గం కొనసాగుతుందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై సభ్యుల అభిప్రాయం మేరకు చర్యలు తీసుకుంటామని. ఈ పరిష్కారంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషించినట్లు చర్చించారు. సమస్య తీవ్రరూపం దాల్చకుండా వెంటనే పరిష్కరించాలని ఇద్దరూ ప్రత్యేకంగా సూచించినట్లు తెలిపారు. అనంతరం జానీ వైఫ్, డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సుమలత మాట్లాడుతూ.. మేము పోరాడితే శ్రమ దోపిడి జరగకూడదనే, ఆ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనంతరం చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వల్లభనేని అనిల్ గారు, సుమలత గారు ఇలా ఇద్దరు పోరాడితే, గొడవడిదే కార్మికుల సంక్షేమం కోసమే సుమలత గారు శ్రమ దోపిడి లేకుండా చూడాలని అనిల్ గారిని కోరారని, ఆయన కూడా ఆ సమస్య మీద దృష్టి సారించారని చెప్పారు. మొత్తానికి ఈ సమస్య ఇంతటితో సమసిపోయిందని చెప్పారు.

