ఖమ్మంలో శబ్ద కాలుష్యం సృష్టించే బుల్లెట్ సైలెన్సర్లను పోలీసులు రోడ్డు రోలర్ కింద తొక్కించారు. నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసి విపరీతమైన శబ్ద కాలుష్యం సృష్టించే బుల్లెట్ సైలెన్సర్లను పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రోడ్డుపై వేసి రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.
బైక్‌ల విషయంలో స్టైల్ కోసం కొంత మంది యువకులు, ఆకతాయిలు తమ బైకులకు ఎక్కువగా వచ్చే సైలెన్సర్లను అమర్చుకుంటూ.. సైలెన్సర్ల అర్థాన్నే మార్చేస్తున్నారు. మరికొందరు సైలెన్సర్లకు రంధ్రాలు చేసి మరీ సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
సైలెంట్‌గా పోయేవాళ్లు.. ఆ సైలెన్సర్ల నుంచి వచ్చే శబ్దాలు విని భయపడాలని అన్నారు. వయసు పైబడిన వారు, గుండె జబ్బులు ఉన్నవారికైతే గుండె ఆగినంత పనౌతుందని అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ విధంగా.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ద్వారా ట్రాఫిక్ నగరంలో పోలీసులు సైలెన్సర్లపై కొరడా ఝుళిపించారు.
నిబంధనలకు విరుద్ధంగా బైక్‌లకు పెద్దగా శబ్దం వచ్చేలా అమర్చిన సైలెన్సర్లను గుర్తించారు. అధిక శబ్దం చేస్తున్న 1650 బైకులను గుర్తించి వాటి సైలెన్సర్లను తీయించి, రోడ్డుపై ఇలా పేర్పించి.. రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేయించారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “వామ్మో.. ఖమ్మంలో ఇన్నాళ్లూ ఇన్ని బైకులు చెవులకు చిల్లులు పడేలా చేశాయా..?”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

