దేశంలో నైరుతి రుతుపవనాలు మరోసారి ఊపందుకున్నాయి. జూన్ ప్రారంభంలో కొద్దిరోజులు నెమ్మదించిన రుతుపవనాలు మళ్లీ వేగం పుంజుకుని ఉత్తర భారత దిశగా చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రారంభించింది. దీనితో వచ్చే వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఉత్తర తెలంగాణ పరిసర ప్రాం తాలపై ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. జూన్ 27 నుండి జూలై 2 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయి.
రాబోయే 7 తెలంగాణలో అనేక చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి, చాలా ప్రాం తాల్లో 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇక రాజధాని హైదరాబాద్లో వచ్చే 24-48 గంటల్లో మోస్తరు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో నగరవాసులు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుదల అంచనా వేస్తారు. ఇప్పటికే ములుగు, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

