మేషరాశి
మేష రాశి వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలు బాగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా స్థిరత్వం లభిస్తుంది. ఏదైనా ఒకదానిని ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు మీరు కోరుకున్న కళాశాలలో సీటు లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధిని కలిగి ఉండటానికి ధనసహాయం అందుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సహోదరులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహాది శుభకార్యాలు ముడి పడతాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి ఓం మంచి శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ఒత్తిడికి ఎక్కువగా ఉన్నారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకునే అవకాశం ఉంది. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఇంటాబయట వ్యవహారాలు కలిసివస్తాయి. నిత్యవసర సరుకులు అమ్మేవారికి మంచి లాభాలు ఉంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభించే దిశగా గ్రహగతులు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులు ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది కొన్ని విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. కుబేర కుంకుమతో మొగలి పువ్వు కుంకుమతో మంగళవారం మరియు శుక్రవారం రోజున అమ్మవారికి అర్చన చేయండి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసివచ్చే రంగు నీవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మిధునం
మిధున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా మరియు వ్యాపారపరంగా మీరు మొదలుపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటే జాగ్రత్త వహించండి. ఒక ప్రణాళికతో పనులు సకాలంలో పూర్తవుతాయి. సంతాన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది పులుసు వచ్చే రంగు గ్రే. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవండి. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సన్నిహితుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. పోటీ పరీక్షలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసుకునే వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు తగాదాలకు దూరంగా ఉంటారు. నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఏదైనా ఒక వారం వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించండి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు లైట్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహం
సింహ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నిత్య ఉద్యోగాలపరంగా వ్యాపారపరంగా చాలా వరకు కలిసికట్టుగా ఉంటుంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. నూతన ప్రాజెక్టులు చేతికందుతాయి. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చుట్టుపక్కల వారితో అప్రమత్తంగా వ్యవహరించాలి. నర దిష్టి ఎక్కువగా ఉంటుంది. కాలభైరవ రూపు మెడలో ధరించండి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. మీ ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత వృద్ధి సాధిస్తారు. దైవ దర్శనాలు విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. శనికి జపం చేయిస్తే కుదిరితే అఘోర పాశుపత హోమం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కన్య
కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు మీరు కోరుకున్న కళాశాలలో సీటు లభిస్తుంది. కొన్ని విషయాలలో మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత ఉండదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. బుధవారం రోజున వినాయకుడికి అభిషేకం చేయించండి. ప్రతిరోజు శివనామ స్మరణ చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
తుల
తులా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ట్రాన్స్ఫర్లు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధనం అందుతుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సంతాన సంబంధమైన విషయాలు బాగా ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. ఈ రాశి వారు ఇంద్రాణి రూపు మెడలో ధరించండి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసే రంగు నీవీ బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు వైద్య వృత్తిలో ఉన్నవారికి నిత్యవసర సరుకులు అమ్మే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులు కలిసి కొన్ని విషయాలు చర్చిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. నూతన కార్యక్రమాలను ప్రారంభానికి శ్రీకారం చుడతారు. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. కీలక విషయాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. రాశి వారు ప్రతి రోజు కూడా సుబ్రహ్మణ్యస్వామి అష్టకం చదవండి. ఉద్యోగస్తులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య అయిదు వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ధనస్సు
ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. యోగంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి అందుతాయి. స్వగృహ నిర్మాణం అంటే కల నెరవేరుతుంది. బంధుమిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విహారయాత్రలు చేస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతాయి. దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి కొంతవరకు తొలగుతుంది. వెజ్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగమున అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిరోజు కాలభైరవ అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు ఇస్తాయి.
మకరం
మకర రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రత్యేక ఉద్యోగాలపరంగా మద్యస్థంగా ఉంటుంది. శుభకార్యాలు వాయిదా పడతాయి. ఎంతో కాలంగా సంతానం కోసం సిద్ధంగా ఉన్నవారు ఈ వారం శుభవార్త వింటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆసాజనకంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోదరుల సహాయంతో కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. బ్యాంకు లోన్లు హౌసింగ్ లోన్లు ఉంటాయి. సంతాన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ప్రతిరోజు నిత్యం హనుమాన్ చాలీసా చదవండి. మంగళవారం మరియు శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కొన్ని విషయాలు చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మిత్రులతో విభేదాలను రాజీ చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఋణాలు తీర్చగలుగుతారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. నూతన ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంతాన సంబంధమైన విషయాలు బాగా ఉన్నాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. విలాసవంతమైన జీవితం కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. మంగళవారం, శనివారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు నీవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీనం
మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రకారం గా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. నీతులు కాంట్రాక్టులు లభిస్తాయి. అనారోగ్య సమస్యల నుండి పొందుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి ప్రయోజనం కలుగుతుంది. భూ సంబంధమైన విష విషయాలు సానుకూల పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి లాభాలు బాగుంటాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి శని గ్రహం దగ్గర నలుపు వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

