విశాలాంధ్ర – కనేకల్: కనేకల్ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి ఊడేగోళం గ్రామం వరకు ఉన్న విద్యుత్ లైన్ల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్గమధ్యంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకు వాలిపోతుండగా, భారీ విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు సడలిపోవడంతో నేలకు అత్యంత సమీపంలో కనిపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన గాలివానలు, ఈగలులకు తీగలు తెగిపడి కిందపడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఊడెళం పరిసరాల్లో విద్యుత్ తీగల కారణంగా ఓ తృటిలో భారీ ప్రమాదం జరగడం, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ముఖ్యంగా కణేకల్ ఎమ్మార్వో కార్యాలయం, పోలీస్ స్టేషన్ సమీపంలోని విద్యుత్ స్తంభాలు గ్రామంతోపాటు తీగలు నేలకు దగ్గరగా సాగడం వల్ల నిత్యం రాకపోకలు సాగిస్తున్న ప్రజలు, వాహనదారులు భయపడుతున్నారు. ఏ చిన్న జరిగినా ప్రాణనష్టం సంభవించే అవకాశం లేదని స్థానికులు హెచ్చరిస్తున్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ సమస్యపై విద్యుత్ శాఖ తక్షణమే స్పందించి, దెబ్బతిన్న విద్యుత్ తీగలను తొలగించి కొత్త తీగలను ఏర్పాటు చేయడంతో పాటు నేలకు వాలిన స్తంభాలను పునఃస్థాపన చేసేందుకు స్థానికులు కోరుతున్నారు.
పోస్ట్ వాలిపోతున్న విద్యుత్ స్తంభాలు… కిందకు వేలాడుతున్న తీగలు… మొదట కనిపించింది విశాలాంధ్ర.

