కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య, భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తే ప్రతిభ తారలు అవార్డులకు పట్టణంలోని శ్రీ వాసవి జూనియర్ కళాశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కిందని ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య, భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లా లోని , కేజీబీవీ, మోడల్ స్కూల్ , ప్రైవేట్ కలశాలకు చెందిన విద్యార్థుల జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 36 మంది ఈ అవార్డుకు ఎంపీక అయ్యరు అని, ధర్మవరానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ప్రతిభ అవార్డుకు ఎంపీగా కాగ వీరంతా శ్రీ వాసవి జూనియర్ కళాశాలకు చెందిన వారు కావడం గమనార్హం. . వీరిలో ఓపెన్ క్యాటగిరిలో ఎం. చరణ్ రుచి తేజ్ రెడ్డి (ఎంపీసీ-990) , బీసీ కేటగిరీలో రాచూర్ శ్రావ్యలక్ష్మి (ఎంపీసీ-990) , పిక్కిలి దీపిక (బైపీసీ-989),వెల్పుల సుమలత(సీఈ సీ-981) , ఎస్సీ కేటగిరిలో సాకే దీక్షిత(ఎంపీసీ-984), సి-974), మైనారిటీ క్యాటగిరిలో షేక్ ఫర్జానా (ఎం ఐ సి-967), సి డబ్ల్యూ ఎస్ ఎన్ కేటగిరిలో గంగులకుంట మన్విత (సీఈసీలో-927) లను ఎంపిక చేయడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అవార్డుకు ఎంపికైన విద్యార్థులను కళాశాలల ప్రిన్సిపాల్స్ చిత్రా ఈశ్వరయ్య ,భాస్కర్ రెడ్డి అధ్యాపక బృందం అభినందనలు తెలియజేసారు.

