కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. కొచ్ఛిన్ మినరల్ అండ్ రుటైల్ లిమిటెడ్ కేసులో ఈ సోదాలను ఈడీ అధికారులు చేస్తున్నారు. మనీలాండరింగ్ కేసు కింద ఈడీ అధికారులు పినరయి విజయన్ నివాసంతో పాటు కేరళలోని పది ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.
మనీలాండరింగ్ కేసులో…
మనీలాండరింగ్ కేసులోనే ఈ సోదాలు చేపట్టారు. 1.72 కోట్ల రూపాయల మనీలాండరింగ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో ఉదయం నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరుపుతున్నారు. 2018లో నమోదయిన కేసులో విజయన్ కుమార్తె వీణకు చెందిన కంపెనీ ఈ మనీలాండరింగ్ కు పాల్పడినట్లు 2024లో కేసు నమోదైంది.

