అమరావతి: బాలికపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మెగల్రాజపురం ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి భవనానికి వాచ్ మెన్ గా పని చేస్తూ తన భార్య, 12 ఏళ్ల కూతురుతో అక్కడే ఉన్నాడు. భవన నిర్మాణ పనుల కోసం 32 ఏళ్ల చిన్నారావు అక్కడికి వస్తు ఉండేవాడు. చిన్నారావు బాలికను పలుమార్లు బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. గత రెండు రోజుల నుంచి బాలిక నీరసంగా ఉండటంతో తల్లిని కూతురు అడిగింది. విషయం చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

