రణబాలి: విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో తెలంగాణ స్లాగ్ లో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఆయన డిఫరెంట్ జానర్ లో నటించి మెప్పించే ప్రయత్నం చేసాడు. ఇక రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ‘రణబాలి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. హిస్టారికల్ పీరియడ్ ను తీసుకొని ఈ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయంలో కూడా విజయ్ దేవరకొండ పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం… పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో ఈ మూవీకి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇక ఇప్పుడు చేస్తున్న సినిమాతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర యాస ల మీద కొన్ని వివాదాలైతే నడుస్తున్నాయి. ఇక ఈ కోరికనే విజయ్ దేవరకొండ రణబాలి అనే మూవీలో అనంతపురం స్లాంగ్ మాట్లాడుతూ కనిపించబోతున్నాడు. మరి ఈ సినిమా తెలంగాణ ప్రేక్షకులను ఎలా అలరించబోతుంది.
ఇప్పటివరకు తెలంగాణ యాస లోనే మాట్లాడిన ప్రేక్షకులని మెప్పించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అనంతపురం స్లాంగ్ లో మాట్లాడి ఎలా మెప్పించాడు. దానిని తెలంగాణ ప్రేక్షకులు ఎలా తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే విజయ్ దేవరకొండ మరొక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు.
దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిమీదనే అతని సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. ఇక దర్శకుడు సాంకృత్యాయన్ సైతం ఇంతకుముందు చేసిన ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఈ రెండు సినిమాలకు మించి సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి…ఇక ఈ సినిమా సెప్టెంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు…

