విజయ్ సేతుపతి యొక్క స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్ టీజర్ రివ్యూ : కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీ ‘స్లమ్ డాగ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
టీజర్ ఎలా ఉందంటే?
చాలా రోజుల తర్వాత తనదైన మార్క్ స్క్రిప్ట్, డైలాగ్స్‌తో పూరి జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ భారీ హైప్ క్రియేట్ చేయగా… టీజర్ ఆ హైప్ పదింతలు పెంచేసింది. విజయ్ సేతుపతి మాస్ రగ్డ్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ‘ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా.’ అంటూ విజయ్ సేతుపతి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్… మక్కల్ సెల్వన్ మాస్ యాక్షన్, వయలెన్స్‌తో అదిరిపోయింది.
స్లామ్స్‌లో బిచ్చగాడిలా ఉండే ఓ వ్యక్తి తన వారి కోసం అధికారులు, మాఫియాతో ఎలా పోరాడాడు? అనేదే మూవీ స్టోరీ అని. హీరోయిన్ టబు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పూరి మార్క్ డైలాగ్స్, వయలెన్స్, యాక్షన్ అదిరిపోయాయి. ఈ మూవీతో హిట్ కొట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : క్రైమ్ థ్రిల్లర్ OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ – ఐఎండీబీలో 9.2 రేటింగ్… ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే, టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్‌తో పాపులర్ అయిన నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంస్థలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రొల్ల ఏర్పాటు చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అనుమతి.
మనుగడ, కోపం మరియు విధి యొక్క కథ వేచి ఉంది.#స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్ టీజర్ ఇప్పుడు ❤️🔥
సినిమాల్లో ఈ 2026 💥
ఎ #పూరి జగన్నాధ్ చిత్రం 🎬@Charmmeofficial బహుకరిస్తుంది 🎥
పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, జెబి నారాయణరావు కొండ్రోళ్ల నిర్మాతలులో విడుదలలు… pic.twitter.com/5Pjmijwwmc
— పూరి కనెక్ట్స్ (@PuriConnects) జూన్ 8, 2026
ఇది కూడా చదవండి : పృథ్వీరాజ్ సుకుమారన్ : వారణాసి విలన్‌తో భ్రమయుగం డైరెక్టర్ మూవీ – హారర్ జానర్ పోస్టర్ చూశారా?
గమనిక : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్లు, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ధర్మేంద్ర | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు

