విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని శాంతినగర్‌లోని గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 350 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ సందర్భంగా 90 మంది పేద విద్యార్థులకు హెడ్మాస్టర్ ఉమాపతి తన సొంత నిధులతో ప్లేట్లను విద్యార్థులకు తన చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఇటువంటి సేవ నాకు కలగడం అదృష్టంగా భావిస్తున్నానని, ప్రభుత్వ పాఠశాలలో చదువు కొరత లేదని, పేదరికానికి ఏది అడ్డం కాకూడదన్న ఉద్దేశంతో, చక్కటి చదువుకు తాను ఎప్పుడు కృషి చేస్తానని అన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు హెడ్మాస్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి పాఠశాల ఉపాధ్యాయ బృందం హెడ్మాస్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పోస్ట్ విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ మొదట కనిపించింది విశాలాంధ్ర.

