నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రానికి చెందిన రావిరాల నరేష్ కుమార్ హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం తన తల్లి జ్ఞాపకార్ధంగా తమ్మడపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్, పెన్నులను మండల విద్యాధికారి జి.శారద చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమాశంకర్, ఉపాధ్యాయులు శ్రీలత, సిఆర్పి రమేష్, నిర్వహించారు.
పోస్ట్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ పుస్తకాలు పంపిణీ మొదట కనిపించింది నవతెలంగాణ.

