ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో లైఫ్ సైల్.. వారి అభిరుచులు.. సిద్దంతాలు కూడా వేరేగా ఉంటాయి. అందరిని ఆ పరమాత్ముడే సృష్టించినా విభిన్న పద్దతులు.. అనేక రకాల మనస్తత్వాలు.. ఎందుకు కలిగి ఉంటారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో రకంగా ఎందుకుంటుంది.. ఆధ్యాత్మిక గ్రంధాలలో జీవన శైలి గురించి ఎలా వివరిస్తారు.. మొదలగు విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
మనుషులకు విధిరాతను బట్టి జీవితం నడుస్తుందా? లేక సంకల్పంతోనే నడుస్తోందా? ఈ సమస్యని లోతుగా గుర్తించే.. ఈ రెండింట్లో మనకు ఇష్టమైనదాన్ని లేదా మన జీవితానికి అనుకూలమైనదాన్ని ఎంచుకుంటాం. మనకు ఎదురయ్యే కొన్ని పరిస్థితులు.. జీవితం మనల్ని ఎలా అణగదొక్కుతుందంటే రియలైజ్ అయ్యేలా ఉంటుంది. అప్పుడు సహజంగానే, జీవితం ఎలా సాగాలో ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉందా? లేదా అనే సందేహం కలుగుతుంది.
ఉదాహరణకు మనం పాస్ వర్ట్ ఉన్న ఒక లాకర్ ను ఓపెన్ చేయాలనుకున్నాం. ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కంట్రోలింగ్ ఏజెన్సీ పంపే ఓటీపీ, రెండోది అంతకు ముందు మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్. ఓటీపీని ఎంపిక వాళ్ల జీవితాల్ని ప్రకృతే కంట్రోల్ చేస్తుంది. కంటికి కనపడని శక్తి ఏది ఇస్తే దాన్నే యాక్సెప్ట్ చేస్తారు వీళ్లు.
కానీ మనుషులు తమ వర్డ్ ను తామే సెట్ చేసుకోగలిగినంత శక్తివంతులు! ఈ నెంబర్ ఏదైనా కానీ, గతంలో దాన్ని ఎంచుకుని. ఉంటారు. పాస్వర్డ్ సెట్ చేసుకునే టైంలో తనకు ఇష్టమొచ్చిన నెంబర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.
కానీ, ఒకసారి సెట్ చేశారంటే దానికి పరిమితమై ఉంటారు. అచ్చంగా అలాగే, మనం కూడా కర్మ చక్రాన్ని మొదలు పెడతాం. అనంతమైన అవకాశాలు ఉన్నాయి. కానీ, గతంలో చేసిన పనులు, స్వభావం ఆధారంగా అందులో ఏదో ఒకదాన్నే ఏంచుకుంటాం. ఇలా ఎంచుకోబడిన ఛాయిస్ మన ఫ్యూచర్ ఆప్షన్స్ కి హద్దులు నిర్ణయిస్తాయి. కాబట్టి, మనం దానికి లోబడి పని చేస్తాము. కోరికల ఆధారంగా పని చేస్తూ మనకు వెళ్లడం వల్ల.. నెమ్మదిగా ఉండే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది.
గతాన్ని బట్టే..
గతంలో చేసిన కర్మల వల్ల మన పాస్వర్డ్ ని మనం సెట్ చేసుకునే స్వేచ్ఛ తగ్గుతుంది. కేవలం యోగులకు మాత్రమే మీకు ఇష్టమైన జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే. వాళ్లు గతం తాలూకు కర్మసంకెళ్ల నుంచి ఇప్పటికే విముక్తి పొంది ఉంటారు. యోగిచేసే ప్రతి పనికొత్తదే! కాబట్టి, అది అతనికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అతను సర్వతంత్ర స్వతంత్రుడు! గతంలో చేసిన కర్మలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయని. మామూలు మనుషులు రియలైజ్ అయ్యేందుకు యోగులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అప్పుడు పాస్వర్డ్ ని రీసెట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తాం. అలాగే, రీసెట్ చేసుకోవాలనుకుంటే గొప్పగొప్ప జీవితాన్ని ప్రయత్నించాలి.
ఎవరు కంట్రోల్ చేస్తున్నారు?
మరి తక్కువ ర్యాంక్ లో ఉండే మనుషులు ఎక్కడి నుంచి ఓటీపీ రిసీవ్ చేసుకుంటున్నారు? ఓటీపీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అంటే, అది శాశ్వతమైన ప్రకృతి, సత్వ, రజో, తమో అని మూడు రకాల గుణాలు ఈ గుణాలే అన్ని రకాల పరిస్థితులకు కారణం అవుతుంటాయి. ఈ గుణాలను బట్టి కష్టాలు, సుఖాలు ఉంటాయి.
- సత్వగుణం: ఈగుణం తెల్లనిది, తేనె లాంటిది. ఇది సంతోషాన్ని ఇస్తుంది.
- రజోగుణం : ఈ గుణం ఎర్రనిది. మత్తులాంటిది. ఇది బాధ కలిగిస్తుంది.
- తమోగుణం: ఇది చీకటి విషం లాంటిది. ఇది అజ్ఞానానికి కారణమవుతుంది.
యోగిక్ ప్రాక్టీస్ తో…
‘మనం మన స్వభావానికి తగ్గట్టే ప్రవర్తిస్తాం… కర్మలు చేస్తుంటాం’ అని గీతంలో శ్రీ కృష్ణుడు అంటాడు. అద్వైత వేదాంతంలో ఈ ప్రకృతిని ‘మాయ’ అన్నారు. ఈ మాయే క్రియేటర్. ఆయనే అన్ని రకాల క్రియేట్ చేస్తాడు. తక్కువ ర్యాంక్‌లో ఉండే మనుషులు మాయాధీనులు అంటే వాళ్లు మాయకంట్రోల్లో ఉంటారు. దీన్నే విధిరాత అనుకుంటూ ఉంటారు. యోగిక్ ప్రాక్టీస్‌లో సాధారణ మనుషులకంటే ఉన్నత స్థాయి ర్యాంక్‌లో ఉన్నవాళ్లు మాయాధీశులు, అంటే వీళ్లే మాయని కంట్రోల్ చేస్తారు. సంకల్ప శక్తితో వీళ్లు స్వేచ్ఛగా… ఇండిపెండెంట్ గా ఉంటారు.

