మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ‘వికసిత్ భారత్’ సాధనే లక్షంగా పట్టుదలగా రక్షణ కృషి చేస్తూ ముందుకు సాగుతున్నామని కేంద్ర శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో మన దేశ ప్రతిష్టాత్మకంగా పెరిగిందని ఆయన చెప్పారు. గతం లో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా బుద్ధి చెప్పామని, అలాగే ‘ఆపరేష న్ సింధూర్’ ద్వారా శత్రువులకు గట్టి సందేశం ఇచ్చామని, మానవత్వానికి శత్రువులైన వారికి సింధు నది నీటిని ఇచ్చే ప్రసక్తే లేదని, పాకిస్థాన్ వైఖరి మారనంత వరకు కఠినంగానే ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఎన్నడూ వివక్ష చూపలేదనీ, దేశ ప్రయోజనాలే తమకు ప్రథమ ప్రాధాన్యమని మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
తెలంగాణకు తమ ప్రభుత్వం చేసిన కేటాయింపులను ఆయన ప్రకటించారు, గతంలో ఉమ్మడి రాష్ట్ర రైల్వే బడ్జెట్ రూ. 1000 కోట్ల కంటే తక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు కేవలం తెలంగాణ రైల్వే బడ్జెట్ కోసమే దాదాపు రూ. 5,000 నుండి రూ. 5,500 కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణలో రూ. 32,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని, ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు, 6 అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. మల్కాజ్‌గిరిలో ఇండియన్ ఆయిల్ కొత్త టెర్మినల్ ప్రారంభం ద్వారా తెలంగాణ ఇంధన అవసరాలు తీరనున్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజా సేవకే అంకితమై ఉంటుందని, దేశ ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తుందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
శుక్రవారం సికింద్రాబాద్‌లో సాయంత్రం నిర్వహించిన మేధావుల సమ్మేళనంలో మంత్రి కేంద్ర రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా ఉన్నారు. గడిచిన 12 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో మన దేశం అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని గౌరవాన్ని, శక్తివంతమైన గుర్తింపును సాధించిందని ఆయన కొనియాడారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ మాటలకు ప్రాధాన్యత కాదని, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు చూస్తున్నాయి. రాజ్‌నాథ్ సింగ్ తన ప్రసంగం ప్రారంభంలో దేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ను భారత దేశంలో అంతర్భాగంగా మార్చి, దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడటంలో పటేల్ చేసిన అసాధారణమైన కృషిని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యబద్ధంగా,
ప్రజలచే ఎన్నికై, అత్యంత సుదీర్ఘకాలం దేశానికి సేవ చేసిన ప్రధాన మంత్రిగా రికార్డు సృష్టించారని, ఇది సామాన్యమైన విజయం కాదని, ప్రజల అచంచల విశ్వాసానికి ప్రతీక అని కొనియాడారు. అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మోడీ గుర్తింపు పొందారని, మోడీ ఆమోదం గడిచిన 12 సంవత్సరాల దేశ ప్రగతిలో, సంస్కరణల పరంగా చరిత్రాత్మకమైనవని, 2047 నాటికి భారతదేశం కచ్చితంగా ‘వికసిత భారత్’గా మారి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకుడికి లేదా పార్టీకి అతిపెద్ద పెట్టుబడిదారుడు రాజకీయాల్లో విశ్వసనీయత అని, దానికి చెప్పే దానికి తేడా ఉంటే విశ్వసనీయత కోల్పోతారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ సంక్షోభం ఉండేదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నామని ఆయన చెప్పారు. మోడీ గారు ప్రధాని కాగానే ‘నా ఖాంగీ, నా కిసీకో ఖానే దూంగా’ అని స్పష్టం చేశారు, మంత్రి అయినా, సామాన్యుడైన అవినీతిని సహించేది లేదని నిరూపించారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 2జి స్కామ్,
కామన్వెల్త్ స్కామ్, ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణం వంటి లక్షల కోట్ల అవినీతి వల్ల దేశ ప్రతిష్ట మసకబారిందని, సైనికుల భద్రతను కూడా పణంగా పెట్టారని. తాము అధికారంలోకి వచ్చాక రక్షణ బడ్జెట్‌ను రూ. 2.5 లక్షల కోట్ల నుండి దాదాపు రూ. 8 లక్షల కోట్లకు పెంచామని, రక్షణ రంగానికి కేటాయించే ప్రతి పైసా అత్యంత పారదర్శకంగా, దేశ భద్రత కోసమే ఖర్చవుతోందనిఆయన తమ పార్టీ వచ్చే ఎన్నికల కోసం కాకుండా, రాబోయే తరం భవిష్యత్తు కోసం ఆలోచిస్తామని చెప్పారు. తాము ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామని, అయోధ్య గడ్డపైనే భవ్య రామమందిరాన్ని నిర్మిస్తామని చెప్పి చూపించామన్నారు. దేశానికి వచ్చే అక్రమ చొరబాటుదారులను సరిహద్దుల వెలుపలికి పంపుతామని చెప్పామని,
ఖర్చు తగ్గించడానికే జమిలి ఎన్నికలు
సమయం, వృధా ఖర్చులను తగ్గించడానికి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని, దేశంలో అందరినీ విశ్వాసంలోకి తీసుకుని ఈ పనిని ఖచ్చితంగా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
నక్సలిజాన్ని తుదముట్టిస్తున్నాం..
శబ్దాలుగా మన భద్రతా దళాలతో, సామాన్య ప్రజలతో రక్తపాతాన్ని సృష్టించిన నక్సలిజాన్ని మోడీ నాయకత్వంలో దేశంలో దాదాపు తుడిచిపెట్టేశామని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని ఎవరూ తొలగించలేరన్న కాంగ్రెస్ మాటలను పటాపంచలు చేస్తూ, తమ ప్రభుత్వం దానిని చిటికెలో రద్దు చేసిందని, ‘ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు చెల్లవు’ అన్న పండిత్ శ్యామప్రసాద్ ముఖర్జీ కలని నిజం చేశామని చెప్పారు. 25 కోట్ల మంది దేశ ప్రజలను పేదరిక రేఖకు ఎగువకు తీసుకువచ్చామని,
అంతర్జాతీయ సంస్థల నివేదికలే దీనిని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. సమానత్వం విషయంలో ప్రపంచంలో భారత్ నేడు నాల్గవ స్థానానికి చేరిందని, రాబోయే 5 నుండి 8 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటోందని చెప్పారు. గతంలో బ్యాంకు ఖాతా తెరవాలంటే సిఫార్సులు, సాక్ష్యాలు కావాల్సి వస్తుందని, ఇప్పుడు 56 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు తెరిపించామని, ఇప్పుడు బ్యాంకే ప్రజల ఇంటి వద్దకు వస్తోందని అన్నారు. దీనివల్ల ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ఢిల్లీ ఖాతా నుండి డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరుకుంది. రాజులమని భావించే కాంగ్రెస్ నాయకులకు పేదరికం, గ్రామీణ బాధలు ఎప్పటికీ అర్థం కావని ఆయన గుర్తు. ఈ సమావేశంలో మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సభకు అధ్యక్షత వహించారు.

