విరాట్ కోహ్లీ స్థానంలో: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో 13 నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ కోసం మేనేజ్మెంట్ జట్టును ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌లో కనిపించిన స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడే అవకాశం లేదు. అతడికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్నాడు.
ఇటీవల ఐపీఎల్లో బెంగళూరు జట్టు తరుపున ఆడిన విరాట్ కోహ్లీ వేగంగానే పరుగులు చేశాడు. అయితే అతడికి గాయం కావడంతో విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. దీనికి తోడు 2027 వన్ వరల్డ్ కప్ ను లక్ష్యంగా పెట్టుకొని మేనేజ్మెంట్ అతనికి విశ్రాంతి ఇచ్చినట్టు చూపుతుంది. అయితే నిన్నటి వరకు మీడియాలో విరాట్ కోహ్లీ స్థానంలో ఐపీఎల్లో చెన్నై జట్టు కెప్టెన్ గైక్వాడ్‌కు అవకాశం ఇస్తారని వార్తలు వచ్చాయి. అధికారికంగా మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి ఇదంతా నిజమేనని అందరు అనుకున్నారు. కానీ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియాలో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
విరాట్ కోహ్లీ స్థానంలో గైక్వాడ్ కాకుండా జైస్వాల్ ఆడతాడని అగార్కర్ చెప్పాడు. “విరాట్‌కి గాయం కావడంతో ఈ సిరీస్‌లో ఆడటం లేదు. అతడి స్థానంలో జైస్వాల్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ సరైన ఫామ్‌లో లేకపోవడంతో టి20 జట్టుకు అతని ఎంపిక చేయలేదు. వైభవ్ ఆట తీరు చూసిన తర్వాత ఎంపిక చేయక తప్పలేదు.. కొన్ని సంవత్సరాలుగా అయ్యర్ అన్ని ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు. అందుకే సారధిగా అతడికి ఎంపికయ్యానని” అగార్కర్ స్పష్టం చేశాడు. మరోవైపు గైక్వాడ్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అదరగొట్టాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. అయితే జైస్వాల్ సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో.. అతడికి అవకాశం ఇచ్చినట్టుంది. ఒకవేళ జైస్వాల్ గనక విఫలమైతే అప్పుడు గైక్వాడ్ కు చోటు లభించే అవకాశం ఉంది.
ఐపీఎల్ లో గైక్వాడ్ చెన్నై జట్టును ఆశించిన స్థాయిలో ముందుకు నడిపించలేకపోయాడు. ఆటగాడిగా కొన్ని సందర్భాల్లో విఫలమయ్యాడు. నాయకుడిగా కూడా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడు. అందువల్లే అతడికి ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో అవకాశం లభించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గైక్వాడ్ కు త్వరలోనే జాతీయ జట్టులో చోటు దక్కుతుందని అతనికి అభిమానులు ఉన్నారు.

