జగన్ విశాఖపట్నం: వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో అస్సలు మార్పు రావడం లేదు. ముఖ్యంగా రాజధానుల విషయంలో ఆయన ఇంకా గందరగోళం లోనే ఉన్నారు. మొదట రాజధాని అమరావతి కి జై కొట్టిన జగన్ తర్వాత మూడు రాజధానులు అన్నారు. మొన్నటికి మొన్న మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు. ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు తాము కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. అసలు ఇంతటి గందరగోళం ఎందుకని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజధానికి అమరావతి విషయంలో వ్యతిరేకముద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై పడిందని.. ముఖ్యంగా విద్యాధికులతో పాటు తటస్తులు దీనిని తప్పుపడుతూ ఓట్ల రూపంలో తీర్పు ఇచ్చిన గుర్తు చేస్తున్నారు. అయినా ఎందుకో జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు రాకపోవడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో అదే..
తాడేపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కు కట్టుబడి ఉన్నామని చెబుతూనే.. మావిగన్ అనేది తమ పార్టీ అజెండా అని.. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అన్న అజెండాతో ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. అదే సమయంలో అమరావతి రైతుల పట్ల తమకు వ్యతిరేక భావన లేదని.. వారికి న్యాయం చేయాలన్నదే తమ పార్టీ అని చెప్పుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తుంటే అపరిచితుడు గుర్తుకొస్తున్నాడు. ఏకకాలంలో మూడు మాటలు చెబుతున్నారు. అమరావతి రైతులంటే తనకు కోపం లేదని చెబుతూనే వారి పట్ల సానుభూతి చూపుతున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ మూడు రాజధానుల మాట మళ్లీ తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్తామని చెబుతున్నారు. అయితే ఏం మాట్లాడుతున్నారో తెలియక ఉన్న మీడియా ప్రతినిధులు కూడా అక్కడ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గుణపాఠాలు నేర్చుకొని జగన్..
ఏదైనా ప్రతికూల అంశాలు ఫలితాలపై ప్రభావం చూపినప్పుడు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. కానీ ఎందుకో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనుకపడ్డారు. అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడి రైతులకు వ్యతిరేకంగా మారిపోయారు. గుంటూరు తో పాటు కృష్ణాజిల్లాలో రాజకీయంగా నష్టపోయారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని జగన్మోహన్ రెడ్డి చెబితే ఉత్తరాంధ్ర ప్రజలు కనీస స్థాయిలో కూడా ఆహ్వానించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ చెబుతున్న మాటకు అటు విజయవాడ ప్రజలు కానీ.. అటు మచిలీపట్నం ప్రజలు కానీ.. మరోవైపు గుంటూరు ప్రజలు కానీ పెద్దగా స్పందించడం లేదు.. అయితే జగన్ ఈరోజు ప్రెస్‌మీట్ లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూనే.. మావిగన్ ప్రస్తావన చేయడం మాత్రం గందరగోళంగా మారింది.

