విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అన్నారు. శుక్రవారం పెద్దకడబూరులో వారు విలేకరులతో వచ్చి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మద్యపాన నిషేధం అంటూ కల్తీ మద్యంతో వెన్నుపోటు, పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేసి నిరుపేదలకు వెన్నుపోటు, అమ్మ ఒడి అని చెప్పి ఒకరికి మాత్రమే వారికి వెన్నుపోటు, జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారని చెప్పారు. ల్యాండ్ టైటిల్ తో రైతులకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైఎస్ జగన్ కే దక్కడం. కేవలం ఉనికిని చాటుకోవడానికి వైసీపీ నిరసన కార్యక్రమాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందు ప్రదర్శన. చెప్పిన మాట ప్రకారం పింఛన్లు పెంపు, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ అందించడం, మూతపడ్డ అన్నా క్యాంటీన్లు తెరిపించడం, మెగా డీఎస్సీ ద్వారా 16432 టీచర్ పోస్టుల భర్తీ చేయడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. వైసీపీ నాయకులు ఏది వెన్నుపోటో, ఏది సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
పోస్ట్ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్ మొదట కనిపించింది విశాలాంధ్ర.

