వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందగా… ఐదుగురు తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. బుధవారం ( జూన్ 10 ) స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వైజాగ్ వెళ్లారు. వైజాగ్‌లోని సెవెన్ హిల్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు. ఈ మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. హయాంలో స్టీల్ ప్లాంట్ లో పదివేల మంది ఉద్యోగులను తొలగించారని.. ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.
స్టీల్ ప్లాంట్ ఘటన బాధాకరమని… ఉక్కు కార్మికుల పరిస్థితి గురించి అందరూ ఆలోచించాలని జగన్ అన్నారు. వైసీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉండేది.. కూటమి హయాంలో ఎలా ఉందొ అందరు గమనించాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ అడ్డుకుందని.. 2021 మార్చి 9న ప్రధాని మోదీకి లేఖ కూడా రాశామని..ప్రైవేట జరగకూడదని గట్టిగా చెప్పామని జగన్ అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో ప్రవర్తించాలని…స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని మోదీకి రెండు లేఖలు రాశామని అన్నారు.
ప్రైవేటీకరణ వద్దని అసెంబ్లీలో కూడా తీర్మానం చేశామని…ప్రైవేటీకరణను ఏపీ కార్మికులకు అండగా నిలుస్తామని అన్నారు.
కార్మికుల కోసం గట్టిగా పోరాడామని.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయేసరికి 28 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని… కూటమి ప్రభుత్వ రెండేళ్ల కాలంలో 500 మందిని తొలగించారని జగన్ అన్నారు.
ప్రభుత్వంలో 6వేల 500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని.. వీఆర్ పేరుతో 1800 మందిపై ఒత్తిడి చేసి తప్పించారని.. మరో 2000 మంది ఉద్యోగులను కూడా తొలగించారని జగన్ తెలిపారు. ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారని అన్నారు. ఉద్యోగుల జీతాలు నాలుగు నెలలు బకాయి పెట్టారని అన్నారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్ తో లింక్ పెట్టారని అన్నారు.
కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని..నిన్న మాటలు చూస్తే ఆశ్చర్యం వేసిందని అన్నారు. లోకేష్ లాంటి మనుషులు క్కూడా ఉంటారా అనిపించిందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా లేదని అన్నారు. బాధితులకు రూ.1.72 కోట్లు మీరు ఇచ్చేదేంటని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇలాంటి ఘటనే జరిగినప్పుడు మేము స్పందించామని.. ఘటన స్థలానికి వచ్చి రూ. కోటి పరిహారం ప్రకటిస్తామని అన్నారు. బాధిత కుటుంబాలకు అప్పట్లో వైఎస్సార్సీపీ తోడుగా ఉందని… కానీ, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సూచించిన తీరు అన్యాయంగా ఉందని.. బాధ్యులకు రావాల్సినవి రాకుండా ఉన్నాయని అన్నారు.
బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు అందించారు.. రూ. కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు జగన్. చంద్రబాబు ప్రభుత్వం కానీ పరిహారం ఇవ్వకపోతే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ. కోటి పరిహారం ఇస్తామని అన్నారు జగన్.

