- వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడిగా ఆరెంజ్ క్యాప్ గెలిచాడు.
- ఫైనల్లో గిల్, సుదర్శన్ విఫలం కావడంతో వైభవ్ ఆరెంజ్ క్యాప్ ఖాయమైంది.
- వైభవ్ 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు, 72 సిక్సర్లు బాదాడు.
- ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.
వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ విజేత | రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 నుంచి ఫైనల్‌కు ముందే నిష్క్రమించినప్పటికీ టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అత్యంత సమీపానికి వచ్చినా 700 మార్క్ దాటినా ఫైనల్లో విఫలం కావడంతో ఆరెంజ్ క్యాప్ బుడ్డోడి సొంతమైంది. కీలకమైన ఫైనల్లో జీటీ ఓపెనర్ బ్యాట్స్మెన్లు త్వరగానే అవుట్ అయ్యారు.
వైభవ్ సూర్యవంశీ కేవలం 15 సంవత్సరాల వయస్సులోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అరుదైన ఘనతను సాధించాడు. జోస్ బట్లర్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఆడుతూ ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్న రెండవ బ్యాటర్ అతడే. బట్లర్ 2022 సీజన్లో రాజస్థాన్ జట్టుకు ఆడుతూ ఆరెంజ్ క్యాప్ సాధించాడు.
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడైన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. కేవలం సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్‌లలో ఒకరు ఫైనల్లో భారీ స్కోరు చేస్తే వైభవ్‌ను వెనక్కి నెట్టేవారు. కానీ ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గిల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేయగా, సుదర్శన్ 12 పరుగులు చేశాడు. వారు అవుట్ అవ్వగానే వైభవ్ ఆరెంజ్ క్యాప్ ఖాయమైపోయింది. వారి తర్వాత అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ మ్యాచులో కోహ్లీ కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతను వైభవ్ కంటే 176 పరుగులు వెనుకబడి ఉన్నాడు.
ఇది కూడా చదవండి: IPL 2026 చాంప్స్ RCB: ఆర్సీబీ అదరహో.. వరుసగా రెండో ఏడాది చాంపియన్ గా నిలిచిన పాటిదార్ సేన.. దిగ్గజ టీం ల సరసన్ ఆర్సీబీ
వైభవ్ సూర్యవంశీ కనిపించాడు
ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీకి ఇది రెండవ సీజన్ మాత్రమే. ఐపీఎల్ 2026లో 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 48.50 సగటుతో 776 పరుగులు చేశాడు. ఈ సీజన్ మొత్తంలో వైభ్ ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు చేశాడు. వైభవ్ రెండు నాకౌట్ మ్యాచులలో తృటిలో సెంచరీలు కోల్పోయాడు. ఎలిమినేటర్ లో సన్ రైజర్స్ మీద 97 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ, క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ మీద 96 పరుగులు చేసి సెంచరీ చేజార్చుకున్నాడు. విరాట్ కోహ్లీ సైతం 700 పరుగుల మార్క్ చేరలేకపోయాడు.
ఇది కూడా చదవండి: IPL 2026 ప్రైజ్ మనీ వివరాలు: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత దక్కుతుందంటే..?
15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభ్ ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2026లో ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ 72 సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్ల రికార్డు క్రిస్ గేల్ పేరుతో ఉండేది. 2012 సీజన్లో యూనివర్సల్ బాస్ గేల్ 59 సిక్సర్లు కొట్టాడు.
ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన జీటీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ (75 నాటౌట్)తో రాణించడంతో 5 వికెట్ల తేడాతో ఆర్సీ టార్గెట్ ఛేదించి వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచింది.
ఇంకా చదవండి

