భారత్ కు మంచి గుర్తింపు వస్తోంది. ఒక్కొక్క జనరేషన్ ఇక వెళుతుందనుకున్న సమయంలో మరొక యువ కెరటం వచ్చి టీం ఇండియాను గట్టెక్కిస్తున్నారు. సచిన్ తర్వాత… ఎవరు? థోని తర్వాత ఎవరు? రోహిత్.. విరాట్ కోహ్లి తర్వాత…? అన్న ప్రశ్నకు దొరికేసింది. వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు మారుమోగిపోతుంది. పదిహేనేళ్ల వయసులోనే ఐపీఎల్ 2026 సీజన్లో రికార్డులను బద్దలు కొట్టే సాహసం చేశాడంటే మున్ముందు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడని అర్థమైంది. వైభవ్ సూర్యవంశీ ఆట పట్ల ప్రపంచంలోని అన్ని క్రికెట్ ఆడే దేశాల్లో కూడా చర్చ జరుగుతుండటం విశేషం.
వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ లో చూపించిన ఆటతీరుకు అందరూ ఫిదా అయ్యారు. క్రికెట్ దిగ్గజాలే అతని ఆటతీరును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కేవలం 35 బాల్స్ లోనే సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీకి భారత్ క్రికెట్ కు భవిష్యత్ అని చెప్పాలి. లెఫ్ట్ హ్యాండ్స్ బ్యాటర్ అయిన వైభవ్ ప్రతి బంతిని బౌండరీకో, సిక్సర్ కో మలచడం అందరినీ అబ్బుర పర్చింది. కేవలం ఈ సీజన్లో పదహారు మ్యాచ్లలో 77 పరుగులు చేశాడంటే అతని సత్తా ఏంటో చెప్పకనే తెలుస్తుంది. రెండు సార్లు సెంచరీలు మిస్ చేసుకున్న వైభవ్ తన ముందున్న బౌలర్ ఎవరన్నది అస్సలు చూడకుండా విరుచుకుపడుతుంది రానున్న కాలంలో క్రికెట్ లో ఉన్న ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొడతాడన్న నమ్మకం ప్రతి ఒక్కరికీ కలిగింది.
ఈ ఐపీఎల్ సీజన్ లో 76 సిక్సర్లు బాదడంటే వైభవ్ శక్తి ఏపాటిదో ఇప్పటికే సెలక్టర్లకు అర్థమయి ఉండాలి. 28 బాల్స్ లోనే 97 పరుగులు చేసిన వైభవ్ వెంటనే ఒక షాట్ కొట్టి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. లేకుంటే మొన్ననే గేల్ రికార్డు బద్దలయ్యేది. అయితే రానున్న కాలంలో ఈ రికార్డులు బ్రేక్ చేయడం వైభవ్ సూర్యవంశీకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.రాజస్థాన్ రాయల్స్ నుంచి ఆడిన ఈ చిన్నోడికి మైదానంలో ప్రతి ఒక్కరూ ప్రశంసించేవారు కాదు. అందుకే అతనికి ఫ్యాన్స్ విపరీతంగా పదిహేనేళ్ల వయసులోనే పెరిగారు. ఇంత చిన్న వయసులోనే ఇంతగా రాటుదేలిన వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీం ఇండియా జెర్సీతో కనపడాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ వైభవ్.

