- వైభవ్ సూర్యవంశీపై పాకిస్థాన్ ప్రశంసలు..
- మా వాళ్లు దొరికితే 6 సిక్సులు ఖాయమంటూ పొగడ్తలు..
- పాక్ క్రికెటర్లు సిగ్గు పడాలని వ్యాఖ్యలు..
- బుడ్డోడి ఆటతీరుకు దాయాది ఫిదా..
వైభవ్ సూర్యవంశీ: వైభవ్ సూర్యవంశీ, అతడి విధ్వంసం కేవలం ఐపీఎల్, భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదు. వైభవ్ పేరు ఇప్పుడు దాయాది పాకిస్థాన్‌లో కూడా మార్మోగుతోంది. ఈ బుడ్డోడి ఇన్నింగ్స్‌పై పాక్ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై మెరుపు మ్యాచ్ ఆడి, కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వైభవ్ ఆటకు పాకిస్తాన్ ఫిదా అయింది. వైభవ్‌ను ఇప్పుడు పాకిస్తాన్ ”కాంప్లయిన్ బాయ్” అని పిలుస్తున్నారు.
పాకిస్తానీ మాజీ క్రికెటర్, పాక్ క్రికెట్ కోచ్ బాసిత్ అలీ వైభవ్ సూర్యవంశీ ఇన్సింగ్స్‌పై ప్రశంసలు కురిపించారు. తన యూట్యూబ్ ప్రకటనలో మాట్లాడుతూ.. అతను క్రిస్ గేల్ కన్నా గొప్ప ఆటగాడు పొగడ్తలు కురిపించారు. పాకిస్తాన్ వైభవాన్ని క్రికెట్ స్టార్‌గా కీర్తిస్తోంది. ”గేల్ మిస్టర్ యూనివర్స్, కానీ ఇప్పుడు కుర్రాడు మిస్టర్ యూనివర్స్ అయ్యాడు. కాంప్లాన్ తాగే బబ్లూ.. మీరు అతడిని సూర్యవంశీ అని పిలువమంటున్నారు. ఎంత అద్భుతమైన బ్యాటింగ్” అంటూ బాసిత్ అలీ కొనియాడారు.
పాకిస్తాన్లో సామాన్య ప్రజలు కూడా వైభవ్ సూర్యవంశీని ప్రశంసిస్తున్నారు. ఒక వ్యక్తి ఒక షోలో మాట్లాడుతూ.. ”ఈ రోజు పాకిస్థాన్‌లో ఈద్ పండగ, కానీ ప్రజలంతా ఎక్కువగా వైభవాన్ని అభినందిస్తున్నారు” అని అన్నారు. నిజానికి వైభవ్ అసలైన ఈద్ పండగ జరుపుకుంటున్నాడని కొనియాడారు. ఈ అబ్బాయిని ఏఐతో సృష్టించారా? అని ఆశ్చర్యపోతున్నారు.
స్పోర్ట్స్ యాంకర్ మీరబ్ జీషాన్ షోలో, పాక్ క్రికెట్ అనలిస్ట్ మహ్మద్ మోసిన్ మాట్లాడుతూ..”నేను ఇలాంటి క్రికెట్ ఎప్పుడూ చూడలేదు. దానిని అతను కఠోర శ్రమతో మెరుగుపరుచుకున్నాడు. సూర్యవంశీ వద్ద ప్రతీ బాల్ ఆడే సామర్థ్యం ఉంది. పాట్ కమిన్స్‌ను కూడా ఎదుర్కొన్నాడు. ఒత్తిడిలో ఆడటం అని నైజం కాదు” అని అన్నారు.
పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్లోని ఒక స్పోర్ట్స్ యాంకర్, సూర్యవంశీ కారణంగా పాకిస్థాన్‌లో ఐపీఎల్ క్రేజ్ భారీ స్థాయికి చేరుకుంది. సూర్యవంశీ ఇన్సింగ్స్‌ను వీపీఎన్ ద్వారా పాకిస్తానీలు చూస్తున్నారని, మన క్రికెటర్లను అవమానిస్తున్నాడంటూ వ్యాఖ్యానించాడు. ”మా స్టార్ బౌలర్ హరీష్ రౌఫ్ చెప్పేది, వైభవ్ సూర్యవంశీ మాకు ఏ మాత్రం లెక్కలోకి రాడు అని అంటున్నాడు. ఒక వేళ ఎప్పుడైనా వైభవ్ షాషీన్, రౌఫ్‌లకు ఎదురుపడితే ఆరు బాల్స్‌లో 6 సిక్సులు ఖాయం” అని అన్నారు.

