వైభవ్ సూర్యవంశీ అన్‌లక్కీ డిస్మిసల్స్: వైభవ్ సూర్య వంశీ వయసు 15 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఆడుతున్న తీరు చూస్తుంటే మాత్రం అనుభవం ఉన్న ఆటగాడి కంటే ఎక్కువ సంవత్సరాలలో ఉంది. బంతిని కొట్టే విధానంలో.. వికెట్ కాపాడుకునే విధానంలో అతను చూపిస్తున్న మెచ్యురిటీ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా జట్టులో పెద్దపెద్ద ఆటగాళ్లు సైతం చేతులెత్తేస్తున్న వేళ.. అతడు ఆడుతున్న తీరు అత్యంత గొప్పగా ఉంది.
అతని ఆట తీరు అంత అద్భుతంగా ఉంది కాబట్టి గొప్ప ఆటగాళ్లు అతడిని కొనియాడుతున్నారు. సూపర్ బ్యాటింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇతడి చేతిలో భారత జట్టు అత్యంత భద్రంగా ఉంటుందన్నారు. ఐపీఎల్లో ఈ సీజన్లో ఇప్పటివరకు పరుగుల వరద పారిస్తూ.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు సూర్య వంశీ. రాజస్థాన్ జట్టుకు బ్యాటింగ్ ఎంపిక వెన్నెముక వలె నిలుస్తున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలో ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తూ సత్తా చూపిస్తున్నాడు.
వైభవ్ సూర్య వంశీ ఆట తీరు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు చూపించే దూకుడుకు కొత్తగా ఉపమానాలు అల్లాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు అమోఘం. బంతులను కొడుతున్న తీరు అత్యద్భుతం. వీరోచితమైన బ్యాటింగ్ తో అతడు చూపిస్తున్న తెగువ అనితర సాధ్యం. సూర్య వంశీ కి ఒక విషయంలో మాత్రం ప్రత్యేక ఇబ్బంది ఎదురవుతోంది. అదే సెంచరీల ముందు అతడు అవుట్ కావడం..
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు సెంచరీల ముందు సూర్య వంశీ అవుట్ అయ్యాడు.. అతడు అలా ఉండటం అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు అతడు మూడుసార్లు సెంచరీల ముందు అవుట్ అయ్యాడు. లీగ్ దశలో 93 పరుగుల వద్ద ఒకసారి అవుట్ అయ్యాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో 97 పరుగుల వద్ద మరొకసారి ఒకరు అయ్యాడు. క్వాలిఫైయర్ టు మ్యాచ్‌లో 96 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
ఒకవేళ ఈ మూడు సార్లు అతడు అవ్వకుండా ఉండి ఉంటే.. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు నమోదు చేసి ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించేవాడు. అంతే కాదు, అన్ క్యాప్డ్ ఆటగాడిగా ఈ స్థాయిలో పరుగులు సృష్టించిన ప్లేయర్ గా అతడు రికార్డు నెలకొల్పేవాడు. సూర్య వంశీ ఇలా మూడుసార్లు అవుట్ కావడం పట్ల అతడి అభిమానులు, రాజస్థాన్ యాజమాన్యం తీవ్ర నిర్వేదం వ్యక్తం చేస్తోంది.

