ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం టచ్‌లో ఉండటం, ఆయా కీలక నిర్ణయాలను కేడర్‌తో పంచుకోవడం వంటి పలు కీలక కార్యక్రమాల నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ఏపీలో విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఓ సూపర్ యాప్ ను ఆవిష్కరించింది. ఈ యాప్ ను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… గురువారం నాటి పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆవిష్కరించారు. జగన్ 2.0 సూపర్ యాప్ అని దీనికి పేరు పెట్టారు.
రాజకీయ పార్టీలకు ప్రత్యేకంగా యాప్ తరహా టెక్నాలజీ కొత్తేమీ కాదు. చాలా పార్టీలు తమ కేడర్ కోసం, తమ ఐడియాలజీని క్షేత్రస్థాయిలో కేడర్ దాకా చేరవేయడం, పార్టీ కేడర్‌కు అందించే సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వ నమోదు తదితరాల కోసం దాదాపుగా అన్ని పార్టీల యాప్ తరహా ఏర్పాట్లను పొందుతున్నారు. అందులో భాగంగానే వైసీపీ యాప్ నూ ప్రారంభించింది. జగన్ 2.0 సూపర్ యాప్ పేరుతో ప్రారంభించిన ఈ సందర్భంగా జగన్ పార్టీ కార్యకర్తలంతా డౌన్ లోడ్ చేసుకోవాలని.
జగన్ 2.0 సూపర్ యాప్ ను ఆవిష్కరించిన సందర్భంగా దాని ద్వారా ఏమేం చేస్తామన్న విషయాన్ని కూడా జగన్ ఓ మోస్తరుగా వివరించారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం యమా యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే వారికి అనుకూలంగా సాగుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా పార్టీకి ఓ రేంజిలో సహకారం అందించారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయా పోస్టులను ఎడిట్ చేసి, వక్రీకరించో వాటిపై విష ప్రచారం… ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఈ తరహా యత్నాలను సూపర్ యాప్ ద్వారా అదిగమించామని జగన్ చెప్పారు.
జగన్ 2.0 సూపర్ యాప్ ప్రధాన ఉద్దేశ్యం పార్టీ అధినాయకత్వంతో క్షేత్రస్థాయి కార్యకర్తను అనుసంధానించడమేనని చెప్పాలి. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఈ యాప్ ద్వారా పార్టీ చివరి స్థాయిలో ఉండే కేడర్‌కు నేరుగా చేరడం ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పొచ్చు. అంటే… పార్టీ తీసుకునే కీలక నిర్ణయంపై అయినా పార్టీ కేడర్ తప్పుగా అర్థం చేసుకోవడమనే సమస్య ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఇతర పార్టీ కేడర్‌పై జరిగే దౌర్జన్యాలు, వేధింపులను కూడా ఈ యాప్‌లో పొందడం ద్వారా పార్టీ కేడర్‌కు మరింత వెన్నుదన్నుగా అందించినట్లు అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపుల నమోదు కోసం ఇప్పటికే డిజిటల్ డైరీని వైసీపీ ఏర్పాటు చేయగా…ఇప్పుడు దానిని ఈ సూపర్ యాప్ కు అనుసంధానం చేయనున్నట్టుగా జగన్ చెప్పారు.

