తెలంగాణ:సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది.
మృతుడు చిట్యాల లింగయ్య( చిట్యాల లింగయ్య ) (45),తండ్రి రాములు,భక్తలపురం గ్రామానికి చెందినవాడిగా పేర్కొన్నారు.ఆయనకు భార్య ఉపేంద్ర( ఉపేంద్ర ),ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, లింగయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఖమ్మంలోని ఆసుపత్రికి వెళ్లిన అనంతరం మునగాలలోని తన అత్తగారి ఇంటికి వచ్చారు.
అక్కడి నుంచి రాత్రి తన బంధువుల గ్రామమైన తాడ్వాయికి వెళ్లినట్లు తెలిసింది.శుక్రవారం ఉదయం తాడ్వాయి గ్రామ సమీపంలోని వ్యవసాయ భూమిలో ఉన్న వేపచెట్టుకు ఉరివేసుకుని మృతి చెందిన స్థితిలో ఆయనను స్థానికులు పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.భార్య,ఇద్దరు కుమార్తెల రోదనలు అక్కడున్న వారిని కలచివేశాయి.
సమాచారం అందుకున్న మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


