పద్మారావు, వెలుగు : సూడాన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సూడాన్వాసికి ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఎబోలా స్టేట్ నోడల్ సెంటరైన గాంధీదవాఖానకు. ఐసోలేషన్ వార్డులో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు.
సూడాన్ కు చెందిన మహ్మద్ యాహ్యా యాగోబ్ అహ్మద్(35) సిటీలోని ప్రైవేటు దవాఖానలో మోకాలి సర్జరీ కోసం ఈ నెల 3న రాత్రి ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. స్క్రీనింగ్ చేయగా జ్వరం చూపుతుంది. దీనికి తోడు ఎబోలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉగాండాలోనూ ఉన్నట్లు తేలింది. శాంపిల్స్ సీసీఎంబీకి పంపామని, అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో పుణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు తరలిస్తారని ఎబోలా స్టేట్నోడల్ ఆఫీసర్, గాంధీ జనరల్‌మెడిసిన్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ తెలిపారు.

