విశాలాంధ్ర అనంతపురం టౌన్ : మహిళల రక్షణ, భద్రతకు జిల్లా పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకంఠం సర్కిల్ , ఇతర ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించారు.ఈ పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని మహిళలతో పోలీసులు నేరుగా మాట్లాడారు. ఒంటరిగా వెళ్లే సమయంలో చైన్ స్నాచింగ్ (గొలుసు దొంగతనాలు) బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని సూచించారు.
ఆపద సమయంలో మహిళలకు రక్షణ కల్పించే ‘శక్తి’ యాప్ విశిష్టతను ఈ సందర్భంగా మహిళలకు వివరించారు. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ప్రతి మహిళా ఈ యాప్‌ను కలిగి ఉండటం ఎంతో అవసరమని, అక్కడికక్కడే మహిళల మొబైల్స్‌లో ‘శక్తి’ యాప్‌ను డౌన్లోడ్ చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలో, పోలీసుల సహాయం ఎలా పొందాలో ప్రాక్టికల్‌గా వివరించబడింది. మహిళల భద్రత కోసం పోలీసులు నిరంతరం ఉంటారని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
పోస్ట్ శక్తి బృందాల అవగాహన మొదట కనిపించింది విశాలాంధ్ర.

