- రాహుల్ గాంధీపై చరిత్రకారుడు అనుచిత వ్యాఖ్యలు
- ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’
- రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చరిత్రకారుడు రామచంద్ర గుహ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఘాటుగా స్పందించారు. ప్రధాన పదవికి అర్హుడు కాదంటూ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలోని అనేక ప్రజాస్వామ్య దేశాల్లో అత్యున్నత పదవులను నియమించిన నాయకులు ముందుగా పెద్ద ఎగ్జిక్యూటివ్ పదవుల్లో పనిచేయకుండానే ఎదిగారని పేర్కొన్నారు. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని నరేంద్ర మోడీ ఉదాహరణలను ప్రస్తావిస్తూ గుహకు కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామచంద్ర గుహ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి తగిన అనుభవం ఉందా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పరిపాలనా అనుభవం, విదేశాంగ విధానాలపై అవగాహన వంటి ప్రశ్నలు లేవనెత్తారు. కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత నిజాయితీ మినహా రాహుల్‌ను ప్రధాని పదవికి అర్హ చూపించే అంశాలు ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శశి థరూర్.. గుహ వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని అన్నారు. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రధాని నరేంద్ర మోడీ ఏమి అనుభవం లేదని నిలదీశారు.
“రామచంద్ర గుహ గారూ.. ఇది కాస్త అతిగా ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశమైన అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు బరాక్ ఒబామా కేవలం ఇల్లినాయిస్ నుంచి తొలి టర్మ్ సెనెటర్ మాత్రమే. అప్పటికి ఆయనకు జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో ఎంత అనుభవం ఉందా? అలాగే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి భారత విదేశీ వ్యవహారాల అనుభవం ఎంత?” అని సోషల్ మీడియాలో శశిథరూర్ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ గత పన్నెండేళ్లుగా జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని.. పార్టీ లోపల, బయట అనుభవజ్ఞులైన సలహాదారులు కూడా ఉన్నారని చెప్పారు. “ఏ దేశాధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఒంటరిగా సంక్షోభాలను ఎదుర్కోవాలి. అందుకే వారికి ప్రభుత్వం, సలహా వ్యవస్థలు ఉంటాయి. ఈ వివాదాన్ని ఇక ముగించాల్సిన సమయం వచ్చింది” అని సూచించింది.
రామచంద్ర గుహ ఏమన్నారంటే?
ఈ వారం ప్రారంభంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామచంద్ర గుహ మాట్లాడుతూ.. పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందని చూపించే ఆధారాలు ఏమిటని ప్రశ్నించారు. “రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే క్లిష్టమైన పరిస్థితులను సరిదిద్దడంతో, వివేకంతో ఎదుర్కొన్నారని నిరూపించే అంశం ఏమిటి?” అని ప్రశ్నించారు. అలాగే రాహుల్ గాంధీకి ఉన్న ప్రధాన అర్హత కుటుంబ వారసత్వమేనని, ఆయన తల్లి, తండ్రి, అమ్మమ్మ, ముత్తాత అందరూ ప్రధానమంత్రులుగా పనిచేశారని. వ్యక్తిగతంగా మంచి మనిషి కావడం, కుటుంబ నేపథ్యం తప్ప మరే స్పష్టమైన అర్హత కనిపించడం లేదని గుహ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం గుహ-థరూర్ మధ్య జరిగిన ఈ వాదన జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నాయకత్వంపై, రాహుల్ గాంధీ భవిష్యత్ పాత్రపై మరోసారి రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది.
రండి, @రామ్_గుహఇది కొంచెం ఎక్కువ. బరాక్ ఒబామా, ఇల్లినాయిస్ నుండి మొదటి-పర్యాయం సెనేటర్, అతను భూమిపై అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడైనప్పుడు ప్రపంచ వ్యవహారాలలో ఏ అనుభవం కలిగి ఉన్నాడు, అది బహుళ ప్రపంచ సమస్యలలో చిక్కుకున్నప్పుడు? దాని కోసం, ఎంత… https://t.co/Tyz2iisNXA
– శశి థరూర్ (@ShashiTharoor) జూన్ 6, 2026

