కన్నడ లెజెండరీ నటుడు రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్‌కు తెలుగులో తమ సమకాలీనులైన హీరోలు, వారి కుటుంబాలతో ఎంత మంచి అనుబంధం ఉందో. ముఖ్యంగా మెగా, నందమూరి కుటుంబాలతో ఆయన ఎంతో సన్నిహితంగా మెలుగుతుంటారు. మెగా ఫ్యామిలీలో చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్, సోదరుడు పవన్ కళ్యాణ్.. వీళ్లందరి మీదా శివన్న వల్లమాలిన అభిమానం చూపిస్తాడు.
చరణ్ మీద అభిమానంతో అతడి కొత్త సినిమా పెద్దిలో గౌర్నాయుడు పాత్రలో నటించాడు శివన్న. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా పెద్ది టీం బెంగళూరులో ఒక ఈవెంట్ చేసింది. దీనికి చరణ్, జాన్వి, శివన్న తదితరులు హాజరయ్యాడు.
ఈ వేడుకలో చరణ్‌ను పక్కన పెట్టుకుని స్టేజ్ మీద శివన్న మాట్లాడిన మాటలు అందరినీ కదిలించేశాయి. పవన్ కల్యాణ్, చరణ్‌ల అనుబంధం గురించి మాట్లాడుతూ.. తన తమ్ముడు, దివంగత పునీత్ రాజ్ కుమార్‌ను ఆయన గుర్తు చేసుకోవడానికి ఎమోషనల్ కావడం ఎవరు ఊహించలేదు.
గతంలో గేమ్ చెంజర్ సినిమా వేడుకలో పవన్, చరణ్ పక్క పక్కన కూర్చున్నారు. ఈ సందర్భంగా బాబాయి పట్ల చరణ్ చూపించిన గౌరవం.. తన అన్న కొడుకును పవన్ ప్రేమగా చూసుకున్న వైనం.. స్టేజ్ పైకి పిలిచారని చరణ్ లేవబోతుంటే సెక్యూరిటీ చెప్పేవరకు ఇక్కడే కూర్చోమని పవన్ చేతితో వారించడం.. ఇలా ఆ వీడియో చాలా లవ్లీగా ఉంటుంది.
ఆ వీడియోను శివన్న కూడా చూశాడట. అది ఆయనకు ఎంతో నచ్చిందట. ఆ విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ వీడియో చూసినపుడు తన కు తన తమ్ముడు పునీత్ గుర్తుకొచ్చాడని.. తమ ఇద్దరం కూడా అలాగే ఉండేవారమని శివన్న చెప్పగానే ఆడిటోరియం హోరెత్తింది. అందరూ ఎమోషనల్ అయిపోయారు.
ఇక పెద్ది అద్భుతమైన సినిమా అని, చరణ్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని చెప్పిన శివన్న తాను చేసిన గౌర్నాయుడు పాత్ర తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్లలో ఒకటని ఆయనన్నారు.

