ఈ వేసవి ఏడాదికి గమ్యస్థానంగా శ్రీనగర్ సరైనది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్‌కు భారీగా దేశీయ ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది నుంచి ఈ ఏడాది విమానయానం ద్వారా దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల రద్దీ చూస్తే.. శ్రీనగర్ విజేతగా నిలవటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ప్రయాణికులు మాత్రం పట్టించుకోకుండా ప్రయాణాలు జరిపిన వైనం ఆసక్తికరంగా చెప్పాలి. గ్లోబల్ ఏవియేషన్ డేటా అనలిటిక్స్ ఫ్లాట్ ఫామ్ (ఓఏజీ) తాజా నివేదికను చూస్తే.. ఈ ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి.
టూరిస్టు పరంగా చూస్తే.. ఈ ఏడాది వేసవి విజేతగా శ్రీనగర్. అన్ని విమానాశ్రయాల నుంచి శ్రీనగర్ కు వెళ్లే రూట్లలో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీ – శ్రీనగర్ రూట్లో అత్యధిక టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ రూట్లో ప్రస్తుత సీట్ల సామర్థ్యం 2.08 లక్షలుగా చెప్పాలి. గత వేసవిలో ప్రస్తుతానికి 35 శాతం అదనపు సీట్లను విమానయాన సంస్థలు పెంచడం విశేషం. దేశంలోనే అత్యధిక శాతం వృద్ధి ఈ రూట్లోనే ఉన్నట్లు చెబుతున్నారు.
అంతేకాదు.. మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ – శ్రీనగర్ రూట్.. దేశంలోనే అత్యంత రద్దీగా ఉన్న తొమ్మిదో మార్గంగా నిలిచింది. విమాన సర్వీసులు.. సీట్ల సామర్థ్యం రికార్డు స్థాయిలో పెరగడం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఢిల్లీ తర్వాత ముంబయి నుంచి శ్రీనగర్‌కు అత్యధిక విమానసర్వీసులు.. సీట్ల సామర్థ్యం పెరిగిన రెండో రూట్‌గా చెప్పాలి. మూడో స్థానంలో చండీగఢ్ నుంచి కూడా శ్రీనగర్ కు అత్యధిక పర్యాటకులు విమాన మార్గాన్ని ఎంచుకోవాలి. మరి శ్రీనగర్ కు అత్యధికంగా విమానాలు నడిపిన సంస్థగా ఇండిగో నిలిచింది.
దేశీయ మార్కెట్లో 69 శాతం పైనే వాటా ఉంది. ఇక్కడో ఆసక్తికరం చెప్పాలి. ఎయిరిండియా సంస్థ తన అంతర్జాతీయ మార్గాలను తగ్గించుకొని శ్రీనగర్ లాంటి లాభదాయక పర్యాటక మార్గాల మీద ఫోకస్ చేసిన వైనం తాజా రిపోర్టు. దీంతో నష్టాలను తగ్గించుకోవటంతో పాటు.. పెద్ద ఎత్తున అమ్మకాలు జరిపేందుకు అవకాశం లభించిందని చెప్పాలి.
మూడోస్థానంలో ఆకాశ ఎయిర్‌గా నిలిచింది. ఢిల్లీ – శ్రీనగర్ రూట్ లో ఈ వేసవిలో 2.08 లక్షల సీట్లు అందుబాటులోకి రాగా.. 90 శాతం పైనే సీట్లు ముందుగానే బుక్ కావటం.
గత ఏడాదితో ఢిల్లీ – శ్రీనగర్ విమాన టికెట్ల ధరలు 35 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగాయి. సాధారణంగా ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు రూ.4-6 వేల వరకు టికెట్ల ధరలు ఉంటే.. ఈ వేసవిలో మాత్రం రూ.12-21 వేల వరకు టికెట్ల ధరలు పలికినట్లుగా చెప్పాలి. ముంబయి నుంచి శ్రీనగర్ కు వెళ్లే విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఈ వేసవిలో ఈ టికెట్ల ధరలు కనిష్ఠంగా రూ.18వేలు.. గరిష్ఠంగారూ.27వేల వరకు పెరినట్లుగా వెల్లడైంది.
కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం ఈ రద్దీకి కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో జూన్ చివరి నుంచి ప్రారంభ అమర్ నాథ్ యాత్ర రద్దీ కారణంగా విమాన సీట్ల సంఖ్య ముందస్తుగా పెరిగినట్లు చెప్పాలి. ఇక్కడ కీలకంగా చెప్పాలి. అదేమంటే జూలై 1 నుంచి శ్రీనగర్ కు జర్నీ చేయాలని భావించే వారు ఎవరైనా సరే ఒక జాగ్రత్త తీసుకోవాలి. సెప్టెంబరు 30 వరకు ప్రతి సోమవారం.. మంగళవారాల్లో శ్రీనగర్ విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నారు. దీనికి కారణం.. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో రన్ వే రిపేర్లు పెద్ద ఎత్తున జరుగుతుండటమే. ఈ నేపథ్యంలో తగ్గట్లు తమ టూర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
దేశీయంగా అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ దేశీయ రూట్లను చూస్తే.. ముంబయి – ఢిల్లీ మొదటిస్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే నంబర్ వన్ రూట్ గా నిలిచింది. ప్రస్తుత సామర్థ్యం 6.58 లక్షల సీట్లుగా చెప్పాలి. గత ఏడాదితో ఈ ఏడాది తొమ్మిది శాతం సీట్ల సామర్థ్యం పెరిగినట్లుగా వెల్లడైంది. అదే సమయంలో బెంగళూరు – ఢిల్లీ రెండో అత్యంత రద్దీగా నిలిచింది. ప్రస్తుత సామర్థ్యం 4.31 లక్షల సీట్లుగా చెప్పాలి. అయితే.. గత ఏడాది కంటే ఈ ఏడాది వేసవికి పెరిగిన డిమాండ్ కేవలం ఒక్క శాతం మాత్రమే.
మరోవైపు దేశీయంగా ఈ వేసవిలో డిమాండ్ తగ్గిన విమాన రూట్ల విషయానికి వస్తే.. బెంగళూరు – హైదరాబాద్ గా చెబుతున్నారు. గత ఏడాదితో 1 ఈ ఏడాది తగ్గుదల 5 శాతంగా నమోదైంది. రెండో స్థానంలో అహ్మదాబాద్ – ఢిల్లీ మధ్య కూడా 11 శాతం డిమాండ్ తగ్గినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సమ్మర్ సెలవుల్లో విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం లండన్ వైపు ఎక్కువ సీట్లు.. సర్వీసులను పెంచినట్లుగా చెప్పాలి.
ఢిల్లీ – లండన్ హీత్రూ మధ్య గత సమ్మర్ తో ఈ ఏడాది 15 శాతం ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ముంబయి – లండన్ హీత్రూ మద్య కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 12 శాతం ఎక్కువ సీట్ల సామర్థ్యం పెరిగింది. అదే సమయంలో ముంబయి – దుబాయ్ మధ్య గత ఏడాదిలో ఈ ఏడాది సీట్ల సామర్థ్యం 10 శాతం తగ్గినట్లుగా చెప్పాలి. విమాన ఇంధన ధరల నేపథ్యంలో ఈ వేసవిలో ప్రధాన రూట్ల ధరలు 10 శాతం నుంచి 35 శాతం వరకు ఉన్నాయి.

