శ్రీశైలం జలాశయానికి గురువారం జూరాల ప్రాజెక్టు నుంచి 85 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతమైన తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కనిపిస్తోంది. గత ఏడాదితో పోల్చుకుంటే రెండు నెలలు ఆలస్యమైన కృష్ణా నదికి వరద ప్రవాహం వస్తుండడం ఎల్ నీనో ప్రభావం ఉన్నవేళ వరదరావడం ఊరటగా చెప్పవచ్చు. కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండుకండగా మారడంతో జూరాల ప్రాజెక్టుకు 94 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో 12 వేల గేట్లను ఎత్తి 47 వేల 196 క్యూసెక్కుల దిగువకు వదులుతున్నారు. అదేవిధంగా దిగువరాలలో జల విద్యుత్ ను ఉత్పత్తి చేసి మరో 38వేల225 సెక్కుల నీటిని శ్రీశైలం వైపు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను రెండు రోజులుగా వరద ప్రవాహం వస్తుండడంతో ఆరు రోజులుగా టీసీసీ నిల్వల మేర నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంది ప్రస్తుత నీటిమట్టం అడుగులకు 827. 30 అడుగులకు చేరుకుంది.215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం శ్రీశైలం జలాశయం 46. 8234 టీ.
గత ఏడాది జూన్ మొదటి మాసంలోనే శ్రీశైలం జలశయానికి వరద ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది నేనో ప్రభావం కారణంగా రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే తరుణంలో కృష్ణా నది భారీగా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో వరదలు వస్తున్నందున 15 రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ప్రాజెక్టులకు భారీ వరద వచ్చి చేరుతుంది. అల మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని ప్రాజెక్టులను నిండడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం దిగువ జూరాలకు నీటిని వదులుతోంది. జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండడంతో ప్రాజెక్ట్ అధికారులు వైపు నుంచి వస్తున్న వరద ప్రవాహం ఆధారంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి శ్రీశైలం నీటిని వదులుతున్నారు. ఇట్లాపాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా నీటిని దిగుకకు వదులుతుండడంతో శ్రీశైలం జలశయానికి ఆశాజనకంగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో తెలుగు రాష్ట్రాలకు నీటి కష్టాలు తీరతాయన్న ఆశలు చిగురించాయి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిగా నిండాలంటే మరో రెండు వందల పది టీకాల నీరు ప్రాజెక్టులో చేరాల్సి ఉంటుంది.

