తెలంగాణ:ఉన్నత ఆశయాలతో చదువుల కోసం అమెరికాలోని ఓ తెలుగమ్మాయిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.నల్గొండ జిల్లాకు చెందిన యువతి షికాగోలో జరిగిన ఘోరప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే.నార్కట్‌పల్లి ( నరకట్పల్లి )మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడసు శ్రీనివాస్‌రెడ్డి ( గదాసు శ్రీనివాస్ రెడ్డి )కుమార్తె నవ్య (24) ఉన్నత విద్య కోసం రెండున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లింది.
ఎంఎస్ పూర్తి చేసి,ప్రస్తుతం అక్కడ ఓ పార్ట్ టైం ఉద్యోగం ఉన్నట్లు తెలుస్తోంది.విధి నిర్వహణ అనంతరం ముగ్గురు స్నేహితులతో కారులో ఇంటికి వెళ్తున్నట్లు ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది.
వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద తీవ్రతకు నవ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
శోకసంద్రంలో చెరువుగట్టు చేతికొచ్చిన కూతురు అకస్మాత్తుగా, ఊహించని రీతిలో మృత్యువాత పడడంతో నవ్య స్వగ్రామం చెరువుగట్టులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.కుమార్తె మృతి విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.నవ్య అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి )తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
‘ఉన్నత ఆశయాలతో ఉన్న నవ్య మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.నవ్య మృతదేహాన్ని ఇండియాకు రప్పించేందుకు మంత్రి కృషి చేస్తున్నారు.


