Sandeep Reddy Vanga : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నవాళ్లకే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళతోనే సినిమాలు చేయడానికి చాలామంది దర్శకనిర్మాతలు ఇష్టపడతారు. అందుకే మన స్టార్ హీరోలందరు ఎప్పుడు సక్సెస్ ల బాటలో ఉండాలనే ప్రయత్నం చేస్తారు. అక్కడ వాళ్ళకంటూ ఒక క్రేజ్ ఏర్పడటమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకునే అవకాశం ఉంటే. ఇక ఇలాంటిదే రీసెంట్ గా అఖిల్ సినిమాతో సక్సెస్ ని సాధించడంతో సందీప్ రెడ్డి వంగతో కూడా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం సందీప్ ప్రభాస్ ని హీరోగా పెట్టి స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చేసిన వెంటనే ఆయన మరికొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ తో ఆయన సినిమా చేసే అవకాశాలైతే లేవు అంటూ కొందరు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అఖిల్ సైతం సందీప్ తో సినిమా చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కానీ అదిప్పుడే వర్కౌట్ అయ్యే అవకాశాలైతే లేవు. ఎందుకంటే సందీప్ ప్రస్తుతం కొత్త సినిమాలతో ఉన్నాడు. తన లైనప్ చాలా పెద్దగా ఉంది.
ప్రభాస్ సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ తో కానీ రామ్ చరణ్ తో గాని ఆయన సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక వీళ్ళిద్దరితో కూడా సినిమాలు ఉంటాయట. అలాంటప్పుడు అఖిల్ తో ఆయన సినిమా ఎందుకు చేస్తుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అఖిల్ మార్కెట్ కూడా అంత పెద్దగా లేదు.
అందుకే సందీప్ రెడ్డి వంగ మార్కెట్ కి సరిపడా హీరోగా తను ఎదిగినప్పుడు మాత్రమే సందీప్ అతనితో సినిమా ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు… నిజానికి సందీప్ అతనితో సినిమా చేయకపోయిన తన శిష్యులు ఎవరైనా అఖిల్ తో సినిమా చేస్తే మాత్రం వాళ్ళని ఎంకరేజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..

