తాత్కాలిక టెంట్లు కనుమరుగు, ఇళ్లకు మళ్లిన విద్యార్థులు
53 మెట్రిక్ టన్నుల వ్యర్ధ పదార్ధాలను తొలగించిన ఎన్డీఐడి
నినాదాలున్న గోడలకు పెయింటింగ్, ఫుట్‌పాత్‌ల రిపేర్
టైఫాయిడ్ నుంచి కోలుకుంటున్న దీప్కే
ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేసిన సిజెపి నేత
ఈ పోరాటం ముగింపు కాదు, ఆరంభం మాత్రమే అని స్పష్టీకరణ
కొత్త నినాదాలు, ప్రసంగాలు, ఆందోళనలతో అట్టుడికిన జంతర్ మంతర్ వద్ద తిరిగి ప్రశాం త పరిస్థితి నెలకొంటోంది. మంత్రి పదవికి ధర్మేం ద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆందోళనలకు సారథ్యం వహించిన సిజెపితో కేంద్రం నిర్వహించిన చ ర్చలు విజయవంతం కావడంతో 36 రోజుల జెన్ జీ, సిజెపి నిరసనలకు శనివారం తెరపడింది. సిజెపి దరఖాస్తు మేరకు విద్యార్థుల ఇళ్లముఖం ప ట్టారు. దీంతో ఆదివారంనాడు జంతర్‌మంతర్ వ ద్ద ప్రశాంత వాతావరణం.
సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే టైఫాయిడ్ నుంచి కోలుకోగా, పర్వావరణవేత్త సోనం వాంగ్‌చుక్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. విద్యార్థుల నిరసనలకు ముగియడంతో జంతర్ మంతర్ వద్ద మునిసిపల్ కార్మికులు ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచే పనులను వేగవంతం చేశారు. దాదాపు 100 మందికి పైగా పారిశుధ్య కార్మికులు ఇందులో పాల్గొంటున్నారు. మెకనైజ్డ్ సామగ్రితో భారీ వాహనాలను మోహరించి సుమారు 60 మెట్రిక్ టన్నుల వ్యర్థ పదార్ధాలను అక్కడి నుంచి తొలగించారు. హైడ్రో జెట్టింగ్ మిషన్లతో రోడ్లను పరిశ్రభ్రం చేస్తుండగా, నిరసన నినాదాలతో నిండిన గోడలకు వేస్తున్నారు. దెబ్బతిన్న ఫుట్‌పాత్‌లకు మరమ్మతు పనులు జరుగుతున్నట్లు ఎన్డీ అధికారులు తెలిపారు.
ఇది ఆరంభం మాత్రమే: దీప్కే
మరోపైవు, తమ రాజకీయ పోరాటంపై అభిజిత్ దీప్కే మరోసారి స్పష్టత ఇచ్చారు. దీక్ష విరమించిన తర్వాత విశ్రాంతి తీసుకుంటూ విడుదల చేసిన వీడియోలో తనకు అండగా నిలిచిన మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 36 తర్వాత ఎలాంటి ఆందోళన లేకుండా విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ పోరాటం అంత సులభంగా సాగలేదని, తనపై విమర్శలు వచ్చిన మద్దతుదారులు వెన్నంటి నిలిచారని అన్నారు. వారికి ధన్యవాదాలు. టైఫాయిడ్ కారణంగా జంతర్ మంతర్ వద్ద అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోయానంటూ క్షమాపణ చెప్పారు. ఇది అందరూ కలిసి సాధించిన విజయమని, విద్యార్థులు లేకుండా ఈ విజయం సాధ్యమయ్యేది కాదని అన్నారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి దేశభక్తికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేననీ, ఇంకా సాధించాల్సినది చాలా ఉందని చెప్పారు.

