టెక్నాలజీ విషయంలో చైనా ఎలా ఆలోచిస్తుందో ప్రపంచానికి తెలుసు. ఊహించని ఆవిష్కరణలతో వరల్డ్ వండర్స్ క్రియేట్ చేయడం ఆ కంట్రీ స్పెషల్. టెక్ దిగ్గజ కంట్రీలుగా చెప్పుకునే అమెరికా, యూరప్ దేశాలు కూడా చైనాను చూసి వావ్.. అనేలా వాళ్ల ఇన్వెన్షన్స్ ఉంటాయి. లేటెస్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమ్మర్ కూలింగ్ టెక్నిక్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. అదేంటో చూద్దాం.
చైనాలోని కొన్ని ప్రాంతాలను తీవ్రమైన సమ్మర్ హీట్ పట్టిపీడిస్తున్న తరుణంలో, ఒక ఏరియాలోని అపార్ట్మెంట్లు కొనసాగుతున్న విధానం వైరల్‌గా మారింది. ఉత్తర చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో ఉన్న యున్‌చెంగ్ నగరంలో, ఎత్తైన అపార్ట్మెంట్ భవనాల పైకప్పులపై నీటిని సన్నని తుంపరలా.. అంటే షవర్ రెయిన్స్ లాగా చల్లే మిస్టింగ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. ఇవి వేడిమిని తగ్గించడంతో పాటు, ప్రజల మండే ఎండ నుంచి రిలీఫ్ అందజేస్తుంది.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంటి పైకప్పు నుంచి పొగమంచు మేఘాల్లా కిందికి తేలుతూ, కింద ఉన్న వీధులను, వాకింగ్ వేస్ ను చల్లబరుస్తున్న విజువల్స్ వీడియోలో చూడవచ్చు.
►ఇంకా చదవండి |వెనిజుల భూకంపంలో మిరాకిల్.. చీకట్లోనే 5 రోజులు.. శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడ్డ కుక్కపిల్ల!
పెరుగుతున్న నివాసాలను తట్టుకోవడానికి దేశాలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో, ఈ దృశ్యాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. అలాగే, వాతావరణ మార్పుల నుంచి టౌన్ ప్లానింగ్ ఎలా ఉండాలనేది ఈ వీడియోలను చూస్తే క్లారిటీ వస్తుంది.
పొగమంచు ఎలా కూల్ చేస్తుంది..?
ఈ శీతలీకరణ వ్యవస్థ ఎవాపరేటింగ్ కూలింగ్ అనే సైంటిఫిక్ ప్రిన్సుపుల్ ఆధారంగా పనిచేస్తుంది. ఇంటిలపై అమర్చిన హై ప్రెజర్ నాజిల్లు చాలా సన్నని నీటి బిందువులను గాలిలోకి పిచికారీ చేస్తాయి. ఆ వేపర్స్ ఆవిరైపోతున్నప్పుడు, చుట్టుపక్కల గాలి నుంచి వేడిని గ్రహించి, గాలిని చల్లబరుస్తాయి. దీనికి ఉదాహరణ.. సమ్మర్ లో చెమట వచ్చినప్పుడు అది చల్లబడి బాడీని కూల్ గా చేసే విధానం దీనికి సరిగ్గా సరిపోతుంది.
బయటి ఉష్ణోగ్రతలు 38°C కి దగ్గరగా ఉన్నప్పుడు, ఈ సిస్టమ్ నిమిషాల్లోనే గాలి, ఉష్ణోగ్రతలను దాదాపు 5°C నుండి 8°C వరకు తగ్గుముఖం పడుతుందని చైనా మీడియా చూపిస్తుంది.
నీటి బిందువులు చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల, వేడి, పొడి వాతావరణ పరిస్థితులలో అవి త్వరగా ఆవిరైపోతాయి. దీనివల్ల రోడ్లు గానీ, ఫుట్ పాత్ పై జనాలుగానీ తడవకుండానే కూల్ అయిపోతారు.
ఈ సిస్టమ్ కు నీరు, పంపులు , అధిక పీడన నాజిల్లు అవసరం. దీనికి సాంప్రదాయ ఎయిర్ కండిషనింగ్ కంటే చాలా తక్కువ విద్యుత్తు అవసరం అవుతుంది. చైనాలోని అనేక సిటీల్లో వేసవి కాలంలో పార్కులు, ఓపెన్ ప్లేస్ లు, ఫుట్ పాత్ లు, బస్ స్టాప్ల వద్ద ఇలాంటి ఓపెన్ మాయిస్చర్ (తేమ) సిస్టమ్‌లు ఇప్పటికే ఆ కంట్రీలో వాడుతున్నారు.
చైనా విధానం వెనుక..
ఇటీవలి కాలంలో చైనాలో వాతావరణం మించి వేడెక్కుతోంది. అక్కడ వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి తోడు సిటీల్లో హై రైజ్ బిల్డింగ్స్ కూడా ఒక కారణం. భవనాలు, రోడ్లు, కాంక్రీట్ వేడిని గ్రహించి స్టోర్ చేసుకుంటాయి. దీనితో నార్మల్ టెంపరేచర్ ను మించి అక్కడ ఉష్ణాగ్రతలు నమోదవుతున్నాయి.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రయత్నాలకు ఈ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలియజేసారు. అయితే ఈ సిస్టమ్ వలన నీటి కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే పొగమంచు దాదాపు వెంటనే ఆవిరైపోతుంది కావునా.. తక్కువ నీటి వినియోగం మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూసి ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు ఫుల్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల హీట్ వేవ్ తో యూరప్ కంట్రీస్ లో వేలల్లో జనాలు చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే రోడ్లు కూడా కరిగి రవాణాకు ఉపయోగించలేని స్థితికి వస్తున్నాయి. చైనా అనుసరిస్తున్న ఈ విధానాన్ని చూసి.. యూరప్ కూడా ఇది ఫాలో అయ్యుంటే సేఫ్ అయ్యేది కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “సమ్మర్ హీట్‌ను డీకోడ్ చేసిన చైనా.. రోడ్లు, బిల్డింగులపై షవర్ వర్షాలు.. ఇలా చేస్తే యూరప్ సేవ్ అయ్యేది కదా!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

