దాహంతో మరణించారు సహారా ఎడారి: సహారా ఎడారి.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, క్రూరమైన ప్రాంతాల్లో ఒకటి. చుట్టూ మైళ్ల దూరం వరకు ఇసుక తిన్నెలు తప్ప జీవరాశి జాడ కూడా కనిపించని ఆ నిప్పుల కొలిమిలో తాజాగా ఒక ఘోర విషాదం చోటుచేసుకుంది. మలి దేశంలో ఇస్లాం పవిత్ర పండుగ బక్రీద్ వేడుకలను ముగించుకుని, తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్న కనీసం 49 మంది నైజర్ దేశస్థులు సహా ఎడారిలోనే దాహంతో అల్లాడి ప్రాణాలు విడిచారు. ఒక పండుగ తెచ్చిన సంతోషం, వారి జీవితాల్లో ఇంతటి ఘోర అంధకారాన్ని నింపుతుందని వారు ఊహించలేకపోయారు.
అసలు వీర అంతటి ప్రమాదకరమైన మార్గంలో ఎందుకు తాగాల్సి వచ్చింది?
పశ్చిమ ఆఫ్రికా దేశాలైన నైజర్, మాలి ప్రాంతాలను ప్రజలకు సహారా ఎడారి గుండా సాగే మార్గమే ప్రధాన రవాణా కారిడార్. ఉపాధి కోసమో, బంధువులను కలుసుకోవడానికో చాలా మంది వలసదారులు, స్థానికులు ప్రాణాలకు తెగించి ఈ మార్గంలో ట్రక్కులలో ప్రయాణిస్తారు. ఈ బాధితులు కూడా మాలిలోని ‘టెల్హాండెక్’ అనే పట్టణం నుండి ఒక ట్రక్కులో బయలుదేరారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ వాహనం తన రెగ్యులర్ రూట్ తప్పి ఎడారినకు వెళ్ళిపోయింది.
#నైజర్ ట్రాజెడీ మైగ్రేటోయిర్ à #అస్మాకా
సెలోన్ లే కమ్యూనిక్యూ ఆఫీషియల్ డి ఎల్’ఎటాట్, లే డ్రామ్ ఔరైట్ ఫెయిట్ 49 మోర్ట్స్. Pourtant, selon les témoignages డెస్ సర్వైవెంట్స్, la réalité est bien ప్లస్ tragique : ప్లస్ d’une centaine de personalnes ont perdu la vie.
CES వలసదారుల ఆర్థిక వ్యవస్థలు ప్రారంభమయ్యాయి… pic.twitter.com/6ymeD21iTc– మొహమ్మద్ లిల్లీ (@మెడ్లిల్లీ1) జూన్ 6, 2026
నీళ్లు దొరక్క ప్రాణాలు పణం
ప్రయాణం సజావుగానే సాగుతుందనుకున్న తరుణంలో.. నైజర్-అల్జీరియా సరిహద్దు ప్రాంతమైన అస్సామేకా కు పశ్చిమాన 80 దూరంలో ఆ ట్రక్కు అకస్మాత్తుగా చెడిపోయింది. డ్రైవర్, ప్రయాణికులు కలిసి ఆ వాహనాన్ని బాగు చేసేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ సమయంలో సహారా ఎడారిలో గృహాలు అసాధారణంగా పెరిగిపోయాయి. ఎండ తీవ్రత, వెంట తెచ్చుకున్న నీటి నిల్వలు పూర్తిగా అయిపోవడంతో అక్కడున్న వారంతా దాహంతో అల్లాడిపోయారు. ఎటుచూసినా ఇసుక తుఫానులు, మండుతున్న ఎండల మధ్య నీటి చుక్క దొరక్క ఒకరి తర్వాత ఒకరు అక్కడే ప్రాణాలు విడిచారు.
మాలిలో ఒక పండుగ నుండి తిరిగి వస్తుండగా సహారా ఎడారిలో వారి ట్రక్కు విరిగిపోవడంతో కనీసం 49 మంది వలసదారులు దాహంతో ఉత్తర నైజర్‌లో మరణించారు.
సమీప సరిహద్దు పాయింట్ నుండి 80కిమీల దూరంలో చిక్కుకుపోయి, తీవ్ర వేడి కారణంగా ప్రయాణికులు నీటి కొరతతో బయటపడ్డారు… pic.twitter.com/xDAF4nkY2n
— SIKAOFFICIAL🦍 (@SIKAOFFICIAL1) జూన్ 5, 2026
నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరి ప్రాణాలు సేఫ్
ఈ నరకప్రాయమైన వాతావరణం నుండి ఎలాగైనా బయటపడాలంటే పట్టుదలతో ఇద్దరు ప్రయాణికులు మాత్రం ప్రాణాలకు తెగించి ఎడారిలో నడక సాగించారు. సుమారు 50 కిలోమీటర్ల దూరం మండేటెండలో కాలినడకన ప్రయాణించి, ఎట్టకేలకు అస్సామేకా సరిహద్దు చేరుకుని అక్కడి అధికారులకు సమాచారం అందించారు. వారిచ్చిన వివరాలతో రెస్క్యూ టీం అత్యవసరంగా ఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ.. అప్పటికే కాలం మించిపోయింది. ఆ ఇద్దరు తప్ప ట్రక్కులో ఉన్న మిగిలిన 49 మంది నిర్జీవంగా పడి ఉన్నారు. చనిపోయిన వారందరినీ రెస్క్యూ టీం అక్కడే సామూహిక సమాధులలో అంత్యక్రియలు నిర్వహించింది.
మరో ట్రక్కులో అరవై మందికి ప్రాణదానం
ప్రమాదకరమైన ప్రయాణాల్లో కనీస జాగ్రత్త తీసుకోకపోవడం, వాహనాల కండిషన్లు సరిగ్గా లేకపోవడం ప్రాణాంతకంగా మారుతోంది. ఈ రెస్క్యూ టీం తిరిగి వస్తుండగా.. బ్యాటరీ ఫెయిల్యూర్ కారణంగా ఎడారిలో మూడు రోజులుగా చిక్కుకుపోయిన మరో వాహనాన్ని కూడా గుర్తించింది. అందులో దాదాపు 60 మంది ప్రయాణికులు నీరసించిపోయి చావుకు దగ్గరగా ఉన్నారు. అదృష్టవశాత్తూ రెస్క్యూ టీం వారికి సకాలంలో నీరు అందించి, వాహనాన్ని బాగుచేసి పంపడంతో ఆ 60 మంది ప్రాణాలు దక్కాయి. ఒక పక్క ప్రాణాలు పోతున్నా, మరోపక్క ఆకలి, పేదరికం, ఉపాధి వెతుకులాటలో ఆఫ్రికా వలసదారులు ఇప్పటికీ సహారా ఎడారి గుండా సాగే ఈ ప్రమాదకర ప్రయాణాలను ఆపలేకపోతున్నారు.
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

