విజయవాడలోని సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజు విచారణ ముగిసింది
విజయవాడలోని సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజు విచారణ ముగిసింది. సిట్ అధికారులు నిన్న నాగరాజను అరెస్ట్ చేసి దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. సాయి కృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకు వచ్చారా అనే అంశం ప్రధానంగా ఆరా తీశారు.
విచారణ అనంతరం…
కృష్ణలంక పిఎస్లోని మిగిలిన సిబ్బంది పాత్ర, సిసికెమెరా ఫుటేజీపై సిట్ అధికారులు విచారణ చేపట్టారు. సాయికృష్ణకు ఎక్కడ చికిత్స అందించారు? ఏ వైద్యుడు అతనికి వైద్యాన్ని అందించాడన్న దానిపై నాగరాజును ప్రధానంగా విచారించినట్లు తెలిసింది. నేడు సీఐ నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నిన్న రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పటిష్ట పోలీసు బందోబస్తుతో నాగరాజుని సిట్ అధికారులు ఉంచారు.మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షల కోసం హాస్పటల్ కి నాగరాజును తీసుకెళ్లారు.
వార్తల సారాంశం – విజయవాడలో సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సీఐ నాగరాజు పూర్తి చేశారు

