సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీఆర్ఫీ పోలీసులు, ఆర్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భాగంగా భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశాలోని సంబల్పూర్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని వాడి రైలు మార్గం ద్వారా అక్రమంగా తరలిస్తున్న 36.74 కిలోల డ్రై గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ తనిఖీల్లో పట్టుబడ్డ మొత్తం గంజాయి విలువ సుమారు రూ.18.18 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.మే 28న డ్రగ్స్ అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవింగ్ చేసినట్లుగా ఇద్దరు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గుర్తించారు.
అరెస్టయిన వారిని మహారాష్ట్రకు చెందిన సుధాంశు కుమార్, బీహార్ కు చెందిన సుమన్ కుమార్ గా పేర్కొన్నారు పోలీసులు. సుధాంశు పుణెలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు, సుమన్ కిరాణా దుకాణం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులు రోహిత్ సాని గోరఖే, అభయ్ లు ఒడిశా నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా చేయడానికి విచారణలో తేలిందని అన్నారు. ప్రధాన నిందితుల డైరెక్షన్ లో ఒక్కో ట్రిప్ కు రూ.10 వేల కమీషన్ తో గంజాయి రవాణాకు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు.
మే 25న నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయితో ప్రయాణం ప్రారంభించిన నిందితులు, చర్లపల్లి స్టేషన్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని… రైలు నుంచి దిగిపోయి రెండు రోజుల పాటు ఓ లాడ్జిలో తలదాచుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మే 28న భవ్నగర్ ఎక్స్ ప్రెస్ లో వాడికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

