బ్రెసిలియా: బ్రెజిల్ దేశంలో సినీ రేంజ్లో విమాన ప్రమాదం జరిగింది. రియో డి జెనీరో నగరంలో ఆదివారం (జూన్ 14) ఉదయం రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మరణించారు.. మరికొందరు గాయపడ్డారు. నగర పశ్చిమ భాగాన్ని జనసాంద్రత అధికంగా ఉన్న రెక్రియో డోస్ బాండిరాంటెస్ అనే శివారు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి.
రియో డి జెనీరో సైనిక అగ్నిమాపక అధికారుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొని రియో డి జెనీరో నగర పశ్చిమ భాగంలో కూలిపోయాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లలో ఒకటి ఎలక్ట్రిక్ కార్ల షోరూమ్‌పై కుప్పకూలింది. దీంతో భారీగా చెలరేగిన మంటలు ఆ ప్రాంతమంతా వేగంగా వ్యాపించాయి. దాదాపు 20 కార్లు మంటల్లో కాలిబూడిదయ్యాయి.
►ఇంకా చదవండి |చివరి దశలో మళ్లీ పెంట పెట్టకుర్రి: ఇజ్రాయెల్‌పై ట్రంప్ సీరియస్
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. హెలికాప్టర్లు గాల్లో ఎలా ఢీకొన్నాయనే దానిపై వివిధ కోణాల్లో ఆరా చేస్తున్నారు. ఏటీసీ మిస్ కమ్యూనికేషన్ వల్లే ఈ ప్రమాదం జరుగుతుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “సినీ రేంజ్లో ప్రమాదం: గాలిల్లో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఆరుగురు మృతి”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

