తెలంగాణ:తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని సీఎం రేవంత్ రెడ్డికి ( CM Revanth Reddy )బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు.తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని సీఎంకు హరీశ్ రావు లేఖ ద్వారా సూచించారు.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖను హరీశ్ రావు ( హరీష్ రావు )విడుదల చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించిందని తెలిపారు.

