– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చడంతో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
జూన్ 20న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విజయ్‌పై రాధాకృష్ణన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ నుంచి ఆయన రాజకీయరంగ ప్రవేశాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. అలాగే, ఓ నటి ప్రస్తావన తెచ్చారు. ఆ వంటినే ఆయనపై కేసు నమోదైంది. తాజాగా హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోంది. ఈ అరెస్టును ఖండించారు.
– ప్రకటన –

