Vijay birthday Trisha Krishnan తమిళ గత తెలుగు , తమిళనాడు సీఎం విజయ్ , హీరోయిన్ త్రిష జంటపై సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం జరిగిందో మనమంతా చూశాము. తమిళనాడు రాష్ట్రానికి విజయ్ ముఖ్యమంత్రి అయ్యినప్పుడు ఆయన పేరు నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో , హీరోయిన్ త్రిష పేరు కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలియజేయడం, ప్రమాణస్వీకారానికి హాజరువ్వడం, అంతే కాకుండా రెండు మూడు సందర్భాల్లో ఇద్దరు కలిసి ఒకే ఈవెంట్ కి వెళ్లడం చాలానే జరిగాయి. అంటే మేమిద్దరం లివి రింగ్ లోనే ఉన్నామని జనాలకు చెప్పకనే చెప్తున్నారు. అయితే నేడు విజయ్ పుట్టిన రోజు అనే విషయం అందరికీ తెలిసిందే.
ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే త్రిష , ఈసారి మాత్రం ఎలాంటి శుభాకాంక్షలు తెలియకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింది. అటు ఇన్ స్టాగ్రామ్ లోనూ , ఇటు ట్విట్టర్ లోనూ అభిమానులు త్రిష శుభాకాంక్షలు చాలా ఆతృతగా ఎదురు చూశారు , కానీ ఆమె మాత్రం ఒక్క పోస్ట్ కూడా పడలేదు. సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశం లో ఈమధ్య కాలంలో అత్యధికంగా త్రిష టార్గెట్ అవుతోంది , ఆమె పై ట్రోల్స్ విపరీతంగా పడుతున్నాయి, ఇప్పుడు విజయ్ కి శుభాకాంక్షలు చెప్తే ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తారు , అందుకే సైలెంట్ గా ఉందని విశ్లేషకులు అంటున్నారు . కానీ వాళ్ళు బహిరంగంగానే అనేక సందర్భాల్లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు కదా, ఇప్పుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తే ఏమి అవుతుంది అని అంటున్నారు.
వీళ్ళ మధ్య కచ్చితంగా ఎదో అలజడి రేగిందని , విజయ్ తన భార్య తో కలిసిపోబోతున్నాడు అనే వార్తల్లో నిజం లేదని, అందుకే త్రిష విజయ్ కి దూరం గా సాగుతూ సోషల్ మీడియా లో ప్రచారం. ఇందులో ఏది నిజం , ఏది అబద్దం అనేది పక్కన పెడితే, విజయ్ కి త్రిష నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు రాకపోవడం , కచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయమే. మరోపక్క విజయ్ వీరాభిమాని , ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా శుభాకాంక్షలు తెలియచేయలేదు. ఈమెతో విజయ్ రిలేషన్ మైంటైన్ చేసేవాడని రూమర్స్ సోషల్ మీడియా లో ఏ ర లో ప్రచారం అయ్యాయో అందరికీ తెలిసిందే, మళ్లీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపితే ఎలాంటి నెగెటివిటీ వస్తుందో అని భయపడి ఆమె కూడా సైలెంట్ అయ్యినట్లు తెలుస్తోంది.

