సుకుమార్ : ఇంటెలిజెంట్ గా తనకంటూ గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన సినిమాలో కొంతమంది నటి నటులు మాత్రమే కనిపిస్తారు. క్యారెక్టర్ పరిమితి మేరకు నాటి నటులు ఆయన సినిమాల్లో కనిపిస్తారు. దానికి మించి అనవసరంగా ఉండే నటి నటులు ఎవ్వరు తన సినిమాలో కనిపించారు. ఇక తన సినిమాల్లో నటుడు సుబ్బరాజు కనిపించాడు. ఆర్య సినిమాలో అతను విలన్ నటించినప్పటికి ఆ తర్వాత ఏ సినిమాలో కూడా అతన్ని తీసుకోలేదు. ఆర్య సినిమా చేసే సమయంలో సుకుమార్ కి సుబ్బరాజుకి మధ్య చిన్న విభేదాలు కూడా వచ్చాయని అందుకే అతని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత సుకుమార్ సినిమాల్లో అతను పెద్దగా కనిపించలేదు. ఇక పుష్ప సినిమా సమయంలో ఫహద్ ఫాజిల్ తో సైతం అతనికి చిన్నపాటి గొడవ జరిగిందట. దాంతో తను రాబోయే సినిమాల్లో కూడా అవకాశాలు ఇచ్చే ఛాన్స్‌లు లేవు.
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట సుకుమార్ చేసే సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే నటులు కొంతమంది మాత్రమే ఉంటారు. ఆయన సినిమాల్లో కొందరిని మాత్రమే తీసుకుంటూ ఉంటాడు. ఇక ఏది ఏమైనా కొత్త నటులను కూడా సుకుమార్ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.
అతని క్యారెక్టర్ కి ఎవరైతే సరిపోతారో వాళ్ళను పర్ఫెక్ట్ గా తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ చేసాడు. అందుకే సుకుమార్ సినిమాలో నటిస్తే చాలు వారికి మంచి ఇమేజ్ వస్తుందని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోయే సినిమా కోసం చాలామంది కొత్త నటులను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
ఇప్పటివరకు ఆయన సినిమాలో నటించినటువంటి నటులను మించి వాళ్ళందరితో నటింపజేయాలని వాళ్లందరికి గుర్తింపును తీసుకురావాలని సినిమా మొత్తానికైతే అల్టిమేట్ విజయాన్ని సాధించాలని ఆలోచిస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? ప్రేక్షకులందరిలో సుకుమార్ అంటే ఒక క్రేజ్ ను తీసుకొచ్చి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే…

