GT vs RR: ఐపీఎల్ 2026 ఫైనల్ బెర్త్ కోసం ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు. గుజరాత్ టైటాన్స్ (GT) ఫైనల్ చేరాలంటే ఇప్పుడు 215 రన్స్ చేయాల్సి ఉంది.
9 రన్‌కే 2 వికెట్లు డౌన్:
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్ఆర్కు ఆరంభంలోనే మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1) మహ్మద్ సిరాజ్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే బౌండరీ లైన్ దగ్గర ప్రసిద్ధ కృష్ణకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ (7) కూడా కగిసో రబడ బౌలింగ్ లో శుభ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో లక్నో కేవలం 9 రన్‌కే 2 కీలక వికెట్లు కోల్పోయింది ఫుల్ ప్రెజర్లో పడింది.
పరాగ్, శనక ఫెయిల్:
ఈ థర్థ్ డౌన్లో వచ్చిన రవీంద్ర జడేజా, మరో ఎండ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీతో కలిసి ఇన్స్టాల్లో చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు చేతికి గాయం కావడంతో జడేజా రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ రాగానే ఫోర్, సిక్స్ కొట్టి మంచి ఊపు మీద కనిపించాడు. దాసున్ శనక, జోఫ్రా ఆర్చర్ (7) కూడా చేతులెత్తేయడంతో రాజస్థాన్ కష్టాలు రెట్టింపయ్యాయి.
సెంచరీ మిస్ చేసుకున్న వైభవ్:
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. 15 ఏళ్ల ఓపెనింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మాత్రం గుజరాత్ బౌలర్లపై బాదుడు బాదుడు కంటిన్యూ చేశాడు. అయితే కేవలం 4 పరుగుల తేడాతో మరోసారి సెంచరీ మార్క్‌ను మిస్ చేసుకున్నాడు. 96 పరుగులు చేసిన తర్వాత రబాడ వేసిన ఓ సూపర్బాల్కు వైభవ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక గాయం తగ్గి మళ్లీ క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా రాజస్థాన్ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. పక్కా ప్లానింగ్‌తో ఆడిన జడ్డూ 45 రన్స్ చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు.
చివరి ఓవర్లో 27 పరుగులు:
మ్యాచ్‌కే హైలైట్ ఏంటంటే.. గుజరాత్ నమ్మకమైన స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన లాస్ట్ ఓవర్లో డోనోవన్ ఫెరీరా విధ్వంసం సృష్టించాడు. రషీద్‌ను టార్గెట్ చేస్తూ ఆ ఓవర్లో వరుసగా 1, 6, 6, 6, 2, 6 బాదేశాడు. అంటే ఒకే ఓవర్లో ఏకంగా 27 రన్స్ పిండుకోవడంతో రాజస్థాన్ స్కోరు 214కు చేరింది.
ఇన్నింగ్స్‌ను పెద్ద నోట్‌తో ముగించడం గురించి మాట్లాడండి 😯
🎥 డోనోవన్ ఫెరీరా యొక్క ఆవేశపూరిత ముగింపు #RR 🔥🔥
నవీకరణలు ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #క్వాలిఫైయర్2 | #TheFinalLeap | #GTvRR | @రాజస్థాన్ రాయల్స్ pic.twitter.com/cDJD1vr1Hr
— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 29, 2026

