– ప్రకటన –
నవతెలంగాణ – ఆలేరు రూరల
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూర్య ఘర్ సోలార్ పథకంపై అవగాహన కల్పిస్తున్న తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ గృహ అవసరాల కోసం సోలార్ విద్యుత్ వినియోగం,పథకం ద్వారా లభించే సబ్సిడీలు,దరఖాస్తు విధానం,విద్యుత్ బిల్లుల తగ్గింపునకు రైతులు,గ్రామస్తులకు వివరించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సూర్య ఘర్ ద్వారా సాధారణ ప్రజల ఇళ్లపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తికి ఈ పథకం దోహదపడుతుందని సూచిస్తుంది. ప్రజలకు ప్రభుత్వ వినియోగం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.సోలార్ వ్యవస్థల వినియోగంతో దీర్ఘకాలికంగా విద్యుత్ వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో టీజీఆర్ ఈడీఓ రవి, ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్,ఎంపీవో అనురాధ,కొలనుపాక గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ,బైరాంనగర్ సర్పంచ్ వెంకటేశ్వర రాజు,వార్డు సభ్యులు,వీఓలు ,గ్రామస్తులు ఉన్నారు.
– ప్రకటన –

