Suriya: వైవిధ్యభరితమైన, వైబ్రెంట్ నటనతో సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో సూర్య. ఇప్పుడు ఈ స్టార్ హీరోకు సంబంధించిన నెక్ట్స్ చిత్రంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబాలే ఫిలిమ్స్’ ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
‘సూర్య x హోంబాలే’ కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో సూర్య – జ్ఞానవేల్ కాంబినేషన్లో వచ్చిన ‘జై భీమ్’ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మరోసారి వీరిద్దరూ కలిసి ఒక పవర్ఫుల్, సామాజిక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోత కొత్త సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్ టాలెంటెడ్ బ్యూటీ కయాదు లోహార్ ఎంపికయ్యారు. “మూడు దశాబ్దాలుగా వెండితెరపై కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సూర్యను మా గ్రాండెస్ట్ స్టేజ్‌పైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం” అంటూ హోంబాలే ఫిలిమ్స్ రిలీజ్ నోట్లో ప్రదర్శించారు. విజయ్ కిరగందూర్, చలువే గౌడ సంయుక్తంగా అందించిన ఈ చిత్రం సాయి అభ్యంకర్ సంగీతంస్తుండగా, ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, రెగ్యులర్ షూటింగ్ అప్డేట్స్ వెల్లడి కానున్నాయి.
తదుపరి అధ్యాయం… #SuriyaXHombale
అతను దానిని నిర్మించాడు.
ఫ్రేమ్ ద్వారా ఫ్రేమ్. ఫిల్మ్ బై ఫిల్మ్. పోరాటం ద్వారా పోరాడండి.సత్యాన్ని రక్తికట్టించే పాత్రలు.
నిజ జీవితాల బరువును మోసిన పాత్రలు.
ధైర్యం, నమ్మకం మరియు క్రాఫ్ట్ ద్వారా నిర్వచించబడిన ప్రయాణం.తెరపై మూడు దశాబ్దాల సత్యం.
లెక్కలేనన్ని హృదయాలు… pic.twitter.com/HoZOgQRbC7— హోంబలే ఫిల్మ్స్ (@hombalefilms) జూన్ 29, 2026

