కొన్ని నెలలుగా సరైన పెద్ద సినిమా లేని టైంలో రిలీజైంది పెద్ది. ప్రేక్షకులు ఆవురావురుమని ఉన్న టైంలో విడుదల కావడం దీనికి అతి పెద్ద ప్లస్. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు అదనపు రేట్లు ఇచ్చారు. ముందు రోజు పెద్ద ఎత్తున పెయిడ్ ప్రిమియర్స్ కూడా పడ్డాయి. ఇంకేముంది వసూళ్ల మోత మోగిపోయింది. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా ఉండకుండా బాక్సాఫీస్ దగ్గెర ఎదురే దూసుకుపోయేలా కనిపిస్తోంది.
అన్నీ కలిసొచ్చి రామ్ చరణ్ కెరీర్లో తొలిసారిగా మొదటి రోజే వంద కోట్ల వసూళ్ల మార్కును అందుకోబోతున్నాడన్నది ట్రేడ్ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం పడ్డ పెయిడ్ ప్రిమియర్స్ నుంచే రూ.20 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ఏపీ, తెలంగాణలో రిలీజ్ రోజైన గురువారం రూ.40 కోట్లకు తక్కువ కాకుండా గ్రాస్ కలెక్షన్లు వస్తాయని అంచనా. పొరుగు రాష్ట్రమైన కర్నాటక నుంచి ఏపీ, తెలంగాణకు దీటుగా వసూళ్లు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇండియాలోని మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లు రాకపోవచ్చు. కానీ వైఎస్ సహా విదేశాల్లో పెద్ది భారీ ఓపెనింగ్స్ రాబట్నున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వైఎస్‌లో ప్రిమియర్స్‌తోనే ఈ చిత్రం 1.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. గురువారం కూడా అక్కడ సినిమా స్ట్రాంగ్‌గా నిలబడ్డ సంకేతాలు కనిపిస్తున్నాయి.
గురువారం సెకండ్ షోలు ముగిసేసరికి మొత్తంగా వరల్డ్ వైడ్ పెద్ది వసూళ్లు రూ.100 కోట్ల మార్కును ఈజీగా దాటేస్తాయని అంచనా. సోలో హీరోగా చరణ్ కెరీర్లో ఇప్పటిదాకా ఏ సినిమాకూ ఈ స్థాయి వసూళ్లు రాలేదు. గ’త ఏడాది గేమ్ చేంజర్ సినిమాకు తొలి రోజు వసూళ్లు రూ.180 కోట్లు దాటిన’ట్లు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కానీ.. అది రియల్ కాదని అందరీకీ తెలుసు.
ఆర్ఆర్ఆర్ రూ.200 కోట్ల మేర వసూళ్లు సాధించిన అందులో రామ్ చరణ్ సోలో హీరో కాదు. పెద్ది సినిమా తన భుజాల మీద మోసిన చరణ్.. ఈ సినిమా సక్సెస్, వసూళ్ల విషయంలో మేజర్ క్రెడిట్ తీసుకోబోతున్నాడు. తన బాక్సాఫీస్ స్టామినాకు ఈ సినిమాకు ఒక రుజువుగా నిలవబోతోంది.

