ఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లకు బెయిల్ నిరాకరిస్తూ 2026 జనవరిలో జస్టిస్ అంజారియా, జస్టిస్ అరవింద్ కుమార్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు సోమవారం (మే 18) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉమర్ ఖలీద్ కేసులో దేశ అత్యున్నత ధర్మాసనం తన తీర్పు పైనే సందేహం వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది. UAPA కేసులలో కూడా బెయిల్ నియమం, జైలు మినహాయింపు సూత్రం వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది.
ది #సుప్రీంకోర్టు సోమవారం (మే 18) ‘గుల్ఫీషా ఫాతిమా’ (దీనికి బెయిల్ నిరాకరించిన) తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. #ఉమర్ ఖలీద్ & #షర్జీల్ =ఢిల్లీ అల్లర్ల పెద్ద కుట్ర కేసులో ఇమామ్) ‘KA నజీబ్’లో 3-జడ్జిల బెంచ్ తీర్పును సరిగ్గా పాటించలేదని… pic.twitter.com/c5gk23f8aJ
— లైవ్ లా (@LiveLawIndia) మే 18, 2026
బెయిలే నియమం అనే సూత్రం కేవలం CRPC కింద ఒక శాసనాత్మక భావన మాత్రమే కాదని, అది వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్దోషిత్వ భావనలో పాతుకుపోయిన ఒక రాజ్యాంగ సూత్రమని న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి బి.వి. నాగరత్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. NIA నమోదు చేసిన నార్కో-టెర్రరిజం కేసులో జూన్ 2020 జూన్ నుంచి విచారణ నిమిత్తం జైలులో ఉన్న కుప్వారాకి చెందిన సయ్యద్ ఇఫ్తికార్ అండ్రాబికి బెయిల్ని స్వీకరిస్తూ.. న్యాయమూర్తి బి.వి. నాగరత్న, ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది.
►ఇంకా చదవండి | రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆగవు.. అమెరికా ఆంక్షలు లైట్ తీసుకున్న ఇండియా..!
యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేఏ నజీబ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును.. అత్యున్నత న్యాయస్థానంలోని ఇతర ధర్మాసనాలు కూడా నీరుగార్చలేవని స్పష్టం చేసింది. ముఖ్యంగా.. నజీబ్ కేసులో, ఆర్టికల్ 21 కింద వేగవంతమైన విచారణ హక్కు, సంబంధిత హక్కులు UAPA నిందితులకు కూడా వర్తిస్తాయని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చిందని బి.వి.నాగరత్న, ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం గుర్తుచేసింది.
విచారణ నిరవధికంగా ఆలస్యమైతే UAPA నిందితులను కూడా బెయిల్పై విడుదల చేయాలని తీర్పు చెప్పింది.. ఈ తీర్పు స్పూర్తిని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, సుప్రీంలోని కింది స్థాయి ధర్మాసనాలు నీరుగార్చడం సరికాదని సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

