- సోమవారం దిన ఫలాలు
- ఆ రాశి వారికి ఆటంకాలు తప్పవు
- మొండి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు
ఈరోజు జ్యోతిష్యం జూన్ 15 2026: ధనస్సు రాశి వారికి ఉద్యోగ రంగంలో చిన్న చిన్న సమస్యలు లేదా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ శక్తికి మించిన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు. ఆత్మీయులు, ఇతరుల సహాయ సహకారాలతో గట్టెక్కుతారు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. మహాగణపతి స్వామి. మీరు చేయవలసిన పూజ.. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
కుంభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాలలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన మొండి బాకీలను ఈరోజు వసూలు చేసుకోగలుగుతారు. ఇతరులతో ఉన్న పాత అనుబంధాలు, పరిచయాలు కలిసివస్తాయి. ఉద్యోగంలో కొత్తలను బాధ్యత స్వీకరిస్తారు. మీకు అనుకూలించే దైవం.. లలితా అమ్మవారు. మీరు పూజ చేయవలసినది.. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. భక్తి టీవీ వేదికగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 15 జూన్ 2026 నాటి దినఫలాలు అందించారు. మిగిలిన రాశుల వారి దిన ఫలాలు క్రింది వీడియోలలో ఉన్నాయి.

