దక్షిణ కొరియా : సౌత్ కొరియాలో మూడో రోజు మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతుంది.
దక్షిణ కొరియా: సౌత్ కొరియాలో మూడో రోజు మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతుంది. హ్యుందాయ్ మోబిస్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి లోకేశ్ భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈవీ సెమీకండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాలని లోకేశ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూలమని వివరించనున్నారు.
పలు సంస్థలతో ఒప్పందాలు…
ఇప్పటికే పలు సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకున్న మంత్రి నారా లోకేశ్ ఈరోజు మరికొని కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. విశాఖలో హ్యుందాయ్ మోబిస్ ఆర్ అండ్ డి, ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి, అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు.
వార్తల సారాంశం – దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన మూడో రోజు కొనసాగుతోంది

